-
జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి పరీక్షలు
-
నలుగురికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు అలర్ట్
-
పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో ఇటీవల వెలుగు చూసిన మెలియాయిడోసిస్ కేసుల పట్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం చేబ్రోలు మండలంలోనూ విస్తరిస్తోందని సమాచారం. ఈ నెల 12న చేబ్రోలుకు చెందిన 45 ఏళ్ల ఆశా వర్కర్ సులోచన జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మరణించారు. ఆమె మృతిపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, అందుకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలిస్తున్నారు.
కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామిరెడ్డి గుంటూరులోని ఒక ఆసుపత్రిలో మెలియాయిడోసిస్ వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో వైద్య అధికారులు కొత్తరెడ్డిపాలెం గ్రామంపై దృష్టి సారించారు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న తొమ్మిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, నలుగురిలో కొకై రకం బ్యాక్టీరియా లక్షణాలు కనిపించాయి. మరో కేసులో మెలియాయిడోసిస్ కేసుగా అనుమానాలున్నాయని చేబ్రోలు పీహెచ్సీ వైద్యురాలు ఊర్మిళ తెలిపారు.
ఈ ఐదుగురిలో స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్గా తేలిందని ఆమె వివరించారు. ఈ గ్రామాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మెలియాయిడోసిస్ వ్యాధి అనేది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది సాధారణంగా జంతువులకు, ముఖ్యంగా మేకలు, పందులు మరియు ఆవులకు సంక్రమిస్తుంది. ఇది కలుషితమైన నీరు లేదా మట్టి ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, కీళ్ల నొప్పి, దగ్గు, ఆయాసం మరియు ఛాతీ నొప్పి. సకాలంలో చికిత్స పొందితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి.
Read also : Movie News : ‘కొత్తలోక’ ప్రభంజనం: బాహుబలి 2 రికార్డు బద్దలు!
