Brahmanandam : బ్రహ్మానందం ‘ME and मैं’ ఆత్మకథ ఆవిష్కరణ: రాజకీయాలకు దూరం, నటనకే అంకితం

Brahmanandam's Autobiography 'ME and मैं' Unveiled
  • తనకు రాజకీయ నేపథ్యం లేదన్న బ్రహ్మానందం

  • రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ

  • తన జీవితం సినిమాలకే అంకితమని వెల్లడి

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన జీవిత ప్రయాణాన్ని ‘ME and मैं’ అనే ఆత్మకథ రూపంలో తీసుకొచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, తన జీవితంలోని కీలక అనుభవాలను పంచుకున్నారు.

రాజకీయాలపై స్పష్టత: బ్రహ్మానందం మాట్లాడుతూ తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించానని, నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని చెప్పారు.

నటనపై నిబద్ధత: “నేను ఇప్పటివరకు 1200 చిత్రాల్లో నటించానంటే అది నటరాజ స్వామి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైంది” అని బ్రహ్మానందం తెలిపారు. తన జీవితం సినిమాలకే అంకితమని, నటనను ఎప్పటికీ వీడనని అన్నారు. “నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చేమో కానీ.. నా పెదవికి ఇవ్వలేను. చివరి వరకు నవ్విస్తూనే ఉంటాను” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

మీమ్స్‌పై స్పందన: సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌ గురించి మాట్లాడుతూ, “నన్ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా ‘మీమ్స్ బాయ్’గా మార్చారు. ఏ రూపంలోనైనా సరే పదిమందినీ నవ్వించడమే నా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. తన ఆత్మకథలో కేవలం జీవితానుభవాలే ఉన్నాయని, వివాదాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.

Read also : AP : ఏపీలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు: అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన

Related posts

Leave a Comment