Polvaram Project : పోలవరం ప్రాజెక్టు పనులకు గడువు 2027 జులై

Polavaram
  • గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారన్న సాయి ప్రసాద్
  • నీటి సంరక్షణ చర్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన 
  • కేంద్ర ప్రభుత్వ నిధులతో 38,457 చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధికి సంకల్పించామని వెల్లడి

పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అయితే, గోదావరి పుష్కరాలు జరగబోయే జులై 2027 నాటికే ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలనే దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు.

కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సూచన మేరకు డిసెంబరు 2027 కంటే ముందే, అంటే పుష్కరాల నాటికే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, వాతావరణ మార్పుల దృష్ట్యా నీటి వనరుల సంరక్షణ అత్యంత కీలకమని కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 38,457 చిన్న నీటిపారుదల చెరువులను పునరుద్ధరించాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు.

Read : Tirumala : తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు

Related posts

Leave a Comment