RashmikaMandanna : రష్మిక ఆవేదన: తెల్లవారుజామున ప్రయాణాలు నరకం!:ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో ఎదురవుతున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు ఆమెను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు.
వృత్తి జీవితంలో కష్టాలు పంచుకున్న రష్మిక మందన్న
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో ఎదురవుతున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు ఆమెను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. ఉదయం 3:50 గంటలకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి తీసిన ఒక ఫొటోను రష్మిక షేర్ చేశారు. “ఈ తెల్లవారుజామున 3:50 ఫ్లైట్లు చాలా దారుణం.
ఇది పగలో, రాత్రో కూడా అర్థం కాదు” అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే, ఆమె ఎక్కడికి వెళ్తున్నారో మాత్రం వెల్లడించలేదు.పని కోసం నిద్రను త్యాగం చేయాల్సిన పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “రెండు గంటలు నిద్రపోయి పని మొదలుపెడితే రోజంతా నీరసంగా ఉంటుంది. అసలు నిద్రపోకుండా పనిచేస్తేనూ అదే పరిస్థితి. రోజూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం” అని రష్మిక పేర్కొన్నారు.
సినిమాల విషయానికొస్తే
రష్మిక ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె బాలీవుడ్లో తొలిసారిగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘థమా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాతన గ్రంథాల్లోని వాస్తవాలను, స్థానిక వాంపైర్ల కథల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే ఒక చరిత్రకారుడి కథ ఇది. ‘ముంజ్యా’ ఫేమ్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
దీంతో పాటు తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ఫ్రెండ్’ అనే చిత్రంలో కూడా రష్మిక నటిస్తున్నారు. “ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్” అని ఆమె గతంలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీఏ2 పిక్చర్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు తన మనసుకు ఎంతో దగ్గరైనవని రష్మిక పేర్కొన్నారు.
Read also : Harish Rao : హరీశ్ రావుపై కవిత విమర్శలు: తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు
