SabariExpress : శబరి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ‘సూపర్‌ఫాస్ట్’ – ప్రయాణ సమయం 2 గంటలు ఆదా!

Secunderabad-Thiruvananthapuram Sabari Express New Timings and Train Number.
  • సూపర్‌ఫాస్ట్‌గా మారిన సికింద్రాబాద్- తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్

  • నేటి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు

  •  17229/30 నుంచి 20629/30గా మారిన రైలు నంబర్

సికింద్రాబాద్-తిరువనంతపురం (త్రివేండ్రం) మార్గంలో తరచూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఒక శుభవార్త అందించింది. ఈ రూట్‌లో ఎంతో ముఖ్యమైన శబరి ఎక్స్‌ప్రెస్‌ను తాజాగా సూపర్‌ఫాస్ట్ రైలుగా ఉన్నతీకరించింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వలన ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ కీలక మార్పులో భాగంగా రైలు నంబర్‌ను కూడా మార్చారు. ఇంతకుముందు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు పెట్టనుంది. వేగం పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు ముఖ్యమైన మార్పులు చేశారు.

కొత్త టైమింగ్స్ (సెప్టెంబర్ 30, 2025 నుండి)

 

రూట్ బయలుదేరే సమయం చేరుకునే సమయం గమనిక
సికింద్రాబాద్ – తిరువనంతపురం మధ్యాహ్నం 2:00 గంటలకు మరుసటి రోజు సాయంత్రం 6:25 గంటలకు పాత సమయం: 12:20 PM – 6:05 PM
తిరువనంతపురం – సికింద్రాబాద్ ఉదయం 6:45 గంటలకు (యథాతథం) మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు పాత సమయం: 6:45 AM – 12:45 PM

 

ఈ మార్పుల వలన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా చేరుకోవచ్చని రైల్వే వర్గాలు తెలియజేశాయి.

Read also : USGovernment : అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షోభం: చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిష్క్రమణ

 

Related posts

Leave a Comment