APGovt : సార్వత్రిక ఆరోగ్య బీమా: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Universal Health Policy: AP Government's Key Decision
  • ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియకు ఆమోదం

  • టెండర్లు పిలిచేందుకు ఏపీఎంఎంఎస్‌ఐడీసీకి అధికారాలు

  • రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి బీపీఎల్ కేటగిరీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, సార్వత్రిక ఆరోగ్య బీమాను (Universal Health Policy) అమలు చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియకు ఆమోదం తెలిపింది. డ్రాఫ్ట్ ఆర్‌ఎఫ్‌పీ (Request for Proposal), డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ (Draft Contract Agreement) లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ పథకం అమలుకు టెండర్లు ఆహ్వానించే పూర్తి అధికారాలను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు (APMMSIDC) అప్పగిస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన ఈ పథకం తాజా నిర్ణయంతో అమలుకు మరింత చేరువైంది.

ఎలా వర్తిస్తుందంటే.

  • పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
  • రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) కుటుంబాలుగా పరిగణిస్తారు. వీరికి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ. 2.50 లక్షల వరకు వైద్యం అందుతుంది. ఈ పరిమితి దాటితే, రూ. 25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది.
  • అదేవిధంగా, దారిద్ర్యరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న కుటుంబాలకు కూడా రూ. 2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేయనుంది.
  • Read also : GSTreduction : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు: కొత్త ధరల స్టిక్కర్లకు అనుమతి, వాహనాల ధరలు తగ్గుదల

Related posts

Leave a Comment