ChandrababuNaidu : తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు: సీఎం పర్యటన నేపథ్యంలో కలకలం

Tirupati SV College Targeted: RDX Bomb Threat Near CM Chandrababu Naidu's Helipad.

తిరుపతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. కాలేజీ వద్ద, ముఖ్యంగా హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

కుటుంబ కార్యక్రమం కోసం సీఎం పర్యటన

ఒక కుటుంబ పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం వారి స్వగ్రామం నారావారిపల్లెకు వస్తోంది. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (అక్టోబర్ 6) ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకుంటారు.

ఆయన రాక కోసమే ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తనిఖీల తర్వాత ఈ బెదిరింపు ఫేక్ కాల్ లేదా వట్టి బెదిరింపు మెయిల్గా తేలే అవకాశం ఉన్నా, పోలీసులు మాత్రం భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

Read also : India-Russia : పాక్ JF-17 జెట్లకు రష్యా ఇంజిన్లు – భారత్‌కే ప్రయోజనం” అంటున్న రక్షణ నిపుణులు.

 

 

Related posts

Leave a Comment