PrashantKishor : రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతా – బీహార్ ప్రజల డీఎన్ఏ వ్యాఖ్యలపై ఆగ్రహం

I Will Defeat Revanth Reddy": Prashant Kishor's Vow; Slams Telangana CM Over 'Bihari DNA' Remarks
  • బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి కష్టమ్మీద ముఖ్యమంత్రి అయ్యాడన్న ప్రశాంత్ కిశోర్

  • బీహార్ వారిని రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహం

  • మోదీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేరని వ్యాఖ్య

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కూడా కాపాడలేరని అన్నారు. బీజేపీ, టీడీపీ లాంటి పార్టీల మద్దతుతో కష్టమ్మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, మరోసారి గెలవలేరని జోస్యం చెప్పారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అహంకారంతో బీహారీలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. బీహార్ ప్రజల డీఎన్ఏ తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అని విమర్శించిన వ్యక్తి, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని తనను మూడుసార్లు ఎందుకు అడిగారో చెప్పాలని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి తాను ఏ అవకాశాన్నీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు.

Read also : StockMarket : భారీ లాభాలతో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ – బ్యాంకింగ్ షేర్ల జోరు!

 

Related posts

Leave a Comment