KRAmp : కె-రాంప్ దీపావళి సంచలనం: కిరణ్ అబ్బవరం సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం!

Kiran Abbavaram Gets Emotional as 'K-Ramp' Receives 9.6/10 Rating on BookMyShow.
  • కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా కె ర్యాంప్

  • జైన్స్ నాని దర్శకత్వంలో సినిమా

  • నేడు థియేటర్లలో రిలీజ్ 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద అసలైన వినోదాన్ని సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కె-రాంప్’ పండుగ కానుకగా విడుదలై, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. థియేటర్లు నవ్వులతో నిండిపోగా, చిత్రబృందం ఈ సినిమాను “ఏకగ్రీవ దీపావళి విజేత”గా సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రముఖ టికెటింగ్ వేదిక బుక్‌మైషోలో 9.6/10 అనే భారీ రేటింగ్‌ను సాధించడం, ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంతగా కనెక్ట్ అయిందో స్పష్టం చేస్తోందని హాస్య మూవీస్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. 

ఈ విజయంతో ఉప్పొంగిపోయిన హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ విజయం అందించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీపావళికి కుటుంబాలన్నీ కలిసి థియేటర్‌కి వచ్చి హాయిగా నవ్వుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈ సినిమా చేశాం. మేము అనుకున్నది ప్రేక్షకులు నెలవేర్చారు. ప్రతీ కుటుంబం సినిమాను ఒక ఉత్సవంలా ఎంజాయ్ చేస్తుండటం చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని భావోద్వేగంగా అన్నారు.

సినిమా టాక్‌పై స్పందిస్తూ… “కొందరు ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్‌ అదిరిపోయిందంటున్నారు… కొందరు ఫస్టాఫ్ పర్లేదు సెకండాఫ్ మోతమోగిపోయిందంటున్నారు… ఫైనల్‌గా థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పూర్తిస్థాయి వినోదాన్ని ఆస్వాదిస్తున్నారని వస్తున్న స్పందన మాకు కొండంత బలాన్నిచ్చింది. ఇదే మాకు కావాల్సిన అసలైన విజయం. గతంలో నేను నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రానికి కూడా ఇదే తరహా టాక్ వచ్చింది” అని కిరణ్ పేర్కొన్నారు.

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నరేశ్, వెన్నెల కిశోర్, కామ్నా జెఠ్మలానీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Read also : DonaldTrump : యుద్ధాలను పరిష్కరించడమే నాకిష్టం: డొనాల్డ్ ట్రంప్ – పాక్-ఆఫ్ఘన్ వివాదంపై కీలక వ్యాఖ్యలు.

 

Related posts

Leave a Comment