బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వారంవారం కొందరు ఎలిమినేట్ అవుతుండగా, ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిలో దివ్యేల మాధురి, అలేఖ్య చిట్టి (పికిల్స్ ఫేమ్), రమ్య మోక్ష ముఖ్యులు. అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా కూడా ఉన్నారు.
కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ముఖ్యంగా, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజులోనే దివ్వెల మాధురి కన్నీళ్లు పెట్టుకుంది. నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమోలో ఆమె హౌస్లోని కంటెస్టెంట్లతో గొడవపడి ఏడవడం కనిపించింది.
ప్రోమో వివరాలు:
ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, కల్యాణ్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుండగా, కల్యాణ్ కిచెన్ దగ్గర ఉన్న దివ్యేల మాధురిని పిలిచాడు. మాధురి వచ్చిన తర్వాత, కల్యాణ్ కూర్చోమని ఏదో చెప్పబోయాడు. వెంటనే మాధురి కల్పించుకుని, ఏం? కూర్చోకుంటే ఊరుకోరా?” అంటూ వెటకారంగా మాట్లాడింది.
అయినా కల్యాణ్ శాంతంగా “రేపటి నుంచి షెడ్యూల్ మారుస్తాం” అని చెప్పాడు. దీనికి మాధురి తీవ్రంగా స్పందిస్తూ, “నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది. అప్పుడు చెప్పొచ్చుగా… ఏం చేస్తున్నారు? అప్పుడు తెలియదా?” అని ప్రశ్నించడంతో కల్యాణ్ సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
తరువాత, కల్యాణ్ “మీరిలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది” అన్నాడు. మాధురి కూడా రెచ్చగొట్టేలా జవాబిచ్చింది. ఈ గొడవలో దివ్య కల్పించుకుని, “మీరు ఇక్కడ లేరు… అందుకే చెబుతున్నా. గొడవపడాలని కాదు” అని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ, మాధురి తగ్గకుండా దివ్యతో, కల్యాణ్ తోనూ వాగ్వాదానికి దిగింది.
గొడవ అనంతరం, దివ్యేల మాధురి పక్కకు వెళ్లి కంటతడి పెట్టుకుంది. ఇది చూసిన కల్యాణ్, “అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడు ఏడిస్తే ఎలా?” అంటూ భరణి దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Read also : Gold Rate : బంగారం ధరల్లో పెను సంచలనం: ధనత్రయోదశికి రూ.1.3 లక్షలు, 2026 నాటికి రూ.1.5 లక్షలు?
