RaviTeja : మాస్ మహారాజా రవితేజ : నా కెరీర్ జర్నీ

Ravi Teja Opens Up About His Journey: From Struggle to Star Status
  • రవితేజ తాజా చిత్రంగా ‘మాస్ జాతర’

  • ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల 

  • ఆరంభంలో ఎవరూ వేషాలు ఇవ్వలేదన్న రవితేజ

నటుడు రవితేజ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు (మాస్ ఇమేజ్)ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నేను నటుడిగా ప్రయత్నించినప్పుడు నాకు అవకాశాలు దొరకలేదు. అర్హత లేని వారికి కూడా సిఫార్సుల ద్వారా వేషాలు వెళ్లడం చూశాను. ఇలా అయితే కష్టమని భావించి, దర్శకత్వం వైపు వెళ్లాను. హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ, ఏదో ఒక రోజు నటుడిగా మంచి గుర్తింపు పొందుతాననే నమ్మకం బలంగా ఉండేది” అని తెలిపారు.

నేను పోషించిన పాత్రలలో ‘ఈగల్’ సినిమాలోని పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కాస్త తేలికైన స్క్రీన్ ప్లేతో చెప్పి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉన్న ఈ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అయితే ఆ తర్వాత కాలంలో క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ‘నేనింతే’ సినిమా కూడా చాలా బాగుంటుంది. కానీ అది కూడా విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా, ఈ మూడు సినిమాలు నా అభిమాన చిత్రాల జాబితాలో ఎప్పుడూ ఉంటాయి” అని ఆయన చెప్పారు.

Read also : SuperVaccine : క్యాన్సర్‌ను నిరోధించే ‘సూపర్ వ్యాక్సిన్’అభివృద్ధి కొత్త ఆశలు చిగురించిన వైద్యరంగం

 

Related posts

Leave a Comment