RenuDesai : నటన ఇష్టం, కానీ అదే లక్ష్యం కాదు… భవిష్యత్తులో సన్యాసం?

Renu Desai's Comeback Criticism and Her Spiritual Path

 

  • నన్ను విమర్శించిన వారు ఇప్పుడు క్షమాపణలు చెప్పరని వ్యాఖ్య

  • నటన ఇష్టమే కానీ అదే జీవిత లక్ష్యం కాదని స్పష్టీకరణ

రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు‘ చిత్రంతో దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఈ సినిమాలో ఆమె సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో కనిపించారు. అయితే, ఆ సినిమా సమయంలో తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయని, ఆ విమర్శలు చేసినవారు ఇప్పుడు తనకు క్షమాపణ చెప్పరని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

టైగర్ నాగేశ్వరరావుAP : ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష హెచ్చరిక: 36 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం! చేస్తున్నప్పుడు తనపై కొందరు విమర్శలు చేశారని రేణూ గుర్తుచేసుకున్నారు. “కమ్‌బ్యాక్‌ ఇచ్చింది కాబట్టి ఇకపై అన్ని రకాల సినిమాల్లో నటిస్తుందని, ఎక్కడ చూసినా తనే కనిపిస్తుందని రాశారు. కానీ ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకు నేను మరే సినిమాలోనూ నటించలేదు, ఏ ప్రాజెక్టుకూ సంతకం చేయలేదు. నేను సినిమాలు అంగీకరించలేదని తెలిసి కూడా, నాడు విమర్శించిన వారు ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా? మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడతారు” అని ఆమె అన్నారు.

నటన అంటే తనకు చాలా ఇష్టమే అయినప్పటికీ, అదే తన జీవిత లక్ష్యం కాదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. “నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తానేమో. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను కానీ, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వను. ఒకవేళ నటననే కెరీర్‌గా కొనసాగించి ఉంటే ఇప్పటికి మంచి పేరు సంపాదించేదాన్ని” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తనకు మంచి పాత్రలు, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలు వస్తున్నాయని రేణూ తెలిపారు. త్వరలోనే ఓ కామెడీ చిత్రంలో అత్త పాత్రలో నటించనున్నట్లు వెల్లడించారు. అత్తాకోడళ్ల మధ్య హాస్యభరితంగా సాగే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. తనకు ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఎక్కువని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 

Read also : AP : ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష హెచ్చరిక: 36 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం!

 

Related posts

Leave a Comment