YS Jagan :హైదరాబాద్‌లో విచారణకు హాజరైన జగన్… వైసీపీ కార్యకర్తల హల్‌చల్, ‘2029’ నినాదాలతో హాట్‌టాపిక్

హైదరాబాద్‌లో విచారణకు హాజరైన జగన్… వైసీపీ కార్యకర్తల హల్‌చల్, ‘2029’ నినాదాలతో హాట్‌టాపిక్

హైదరాబాద్‌లో వైఎస్ జగన్ హాజరు – వైసీపీ కార్యకర్తల సందడి, ‘2029’ నినాదాలతో వివాదం

YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు.

జగన్ రాక సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాలు, అలాగే నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంతం వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. పార్టీ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, జగన్‌కు అనుకూల నినాదాలు చేస్తూ కార్యకర్తలు వేడుక వాతావరణం సృష్టించారు.

అయితే, ‘2029లో రప్ఫా రప్ఫా’ అంటూ అభిమానులు చేసిన నినాదాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారీగా చేరుకున్న కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్ట్ లోపలికి ప్రవేశించేందుకు కొందరు ప్రయత్నించడంతో, పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసుల–కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

నాంపల్లి కోర్టు వద్ద రద్దీ

సీబీఐ కోర్టు వద్ద కూడా వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గుమికూడారు. రహదారులపై గుంపులుగా నిలిచి నినాదాలు చేస్తూ, ‘2029లో రప్పా రప్పా’ అంటూ ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో అక్కడి వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

Read : YS Jagan security controversy | YSRCP Moves To High Court

Related posts

Leave a Comment