BHU vacancy 2025 – రీసెర్చ్ అసోసియేట్ & రీసెర్చ్ ఫెలో పోస్టులు
ఉత్తరప్రదేశ్లోని వారాణాసి లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్) మరియు రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ జరుగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5, 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
-
ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): 1 పోస్టు
-
రిసెర్చ్ ఫెలో: 2 పోస్టులు
జీతం:
-
ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): నెలకు రూ. 80,000 వరకు
-
రీసెర్చ్ ఫెలో: నెలకు రూ. 60,000 వరకు
అర్హతలు:
-
సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MA, M.Sc., లేదా PhD పూర్తి చేయాలి
-
కనీస 55% మార్కులు సాధించాలి
-
పోస్టుకు సంబంధించి ఉద్యోగ అనుభవం అవసరం
-
వయసు: 28–42 సంవత్సరాలు
-
SC/ST, దివ్యాంగ మరియు మహిళా అభ్యర్థులకి 5 సంవత్సరాల వయస్సు సడలింపు
ఎంపిక ప్రక్రియ:
-
ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుంది
-
రాత పరీక్ష ఉండదు
దరఖాస్తు విధానం:
-
ఆసక్తి కలిగిన అభ్యర్థులు createindia2025@gmail.com కి డిసెంబర్ 5, 2025 లోపు దరఖాస్తు చేయాలి
-
పూర్తి వివరాల కోసం అధికారిక BHU నోటిఫికేషన్ చూడడం తప్పనిసరి
Read: Digital India Jobs 2025: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
