ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో Chandrababu Naidu
ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో, లబ్ధిదారులకు నేరుగా వెళ్లి కార్యక్రమం అమలు పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తున్నారు.
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన సీఎం, ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లి, కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళను పరామర్శించి, ఆమెకు పింఛన్ను స్వయంగా అందజేశారు.
తరువాత సీఎం నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గొల్లగూడెంలో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయడం కొనసాగుతోంది. డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం 8,190 కొత్త పింఛన్లు మంజూరు చేయగా, పింఛన్ల పంపిణీ కోసం మొత్తం ₹2,738.71 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read : ChandrababuNaidu : నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో 15 ఏళ్ల సీఎం పదవీకాలం – ఒక చారిత్రక ఘట్టం
