HAL Recruitment 2025:Apply Online for Operator Jobs | Eligibility, Salary & Exam Details

HAL Recruitment 2025

HAL Recruitment 2025: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 156 ఆపరేటర్ ఉద్యోగాలు – అర్హత, జీతం, పరీక్ష వివరాలు ఇవే

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 25, 2025 మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల విభాగాలు:

ఫిట్టర్

ఎలక్ట్రానిక్స్

గ్రైండింగ్

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ / ఇన్‌స్ట్రుమెంటేషన్

మెషినింగ్

టర్నింగ్

విద్యార్హత:

అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో

  • 3 సంవత్సరాల NAC లేదా

  • 2 సంవత్సరాల ITI + NAC / NCTVT సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి (25 నవంబర్ 2025 నాటికి):

జనరల్ / EWS: గరిష్ఠంగా 28 సంవత్సరాలు

OBC: గరిష్ఠంగా 31 సంవత్సరాలు

SC / ST: గరిష్ఠంగా 33 సంవత్సరాలు

ఎంపిక విధానం:

అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం:

రాత పరీక్ష మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది.

పార్ట్ 1: జనరల్ అవేర్నెస్ – 20 ప్రశ్నలు

పార్ట్ 2: ఇంగ్లిష్ & రీజనింగ్ – 40 ప్రశ్నలు

పార్ట్ 3: సంబంధిత ట్రేడ్ – 100 ప్రశ్నలు

 మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి
పరీక్ష వ్యవధి: 2 గంటలు 30 నిమిషాలు

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000/- జీతం చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 25, 2025

అడ్మిట్ కార్డులు: డిసెంబర్ 31, 2025 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

HALలో ఉద్యోగం సాధించాలని ఆశించే ITI అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

Read more:Bank of India Announces 514 Credit Officer Jobs – Applications Open from December 20

Related posts

Leave a Comment