F-15 Jet Crash in Iran | 48 గంటల సీక్రెట్ రెస్క్యూ! నిజమా? లేక ప్లానా? | FBTV NEWS

F-15 Jet Crash in Iran | 48 గంటల సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్ | USA vs Iran War Story

అమెరికా (USA), ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఒక F-15 ఫైటర్ జెట్ ఇరాన్‌లో కూలిపోయింది.  ఆ జెట్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రమాదం జరగబోయే ముందు జెట్ నుంచి బయటకు ఎజెక్ట్ అయ్యి, పారాచూట్ సహాయంతో సేఫ్‌గా ఇరాన్ భూమిపై ల్యాండ్ అయ్యారు. శత్రు దేశమైన ఇరాన్‌లో పడిపోయిన ఆ ఇద్దరు పైలట్లను కాపాడటం చాలా కష్టమైన పని. అయినా కూడా అమెరికా వెంటనే ఒక ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. దీనిని Combat Search and Rescue (CSAR) అంటారు.  ఈ ఆపరేషన్ మొత్తం 48 గంటల పాటు సాగింది. ముఖ్యంగా — ఒక్క అమెరికా సైనికుడికి కూడా ఏమీ కాకుండా ఇద్దరు పైలట్లను సేఫ్‌గా బయటకు తీసుకువచ్చారు. అందుకే ఈ సంఘటన ఒక హాలీవుడ్ మూవీ లాగా అనిపించింది.

అసలు క్రాష్ ఎలా జరిగింది? అని చూసినట్టయితే .. ఏప్రిల్ 3న రాత్రి సమయంలో ఇరాన్ మిలిటరీ ఒక ప్రకటన చేసింది — “మేము ఒక F-35 జెట్‌ను కూల్చేశాం” అని.  కానీ అమెరికా వెంటనే అది ఫేక్ అని చెప్పింది.  దాంతో ఇరాన్ కూలిపోయిన జెట్ ఫోటోలు రిలీజ్ చేసింది.  వాటిని చూసిన అమెరికా మిలిటరీ నిపుణులు —జెట్ కూలిపోయిన మాట నిజమే కానీ అది F-35 కాదు, F-15 జెట్ అని నిర్ధారించారు.

దీని అర్థం ఏమిటంటే:అమెరికాకు తమ జెట్ కూలిపోయిందని ముందే తెలుసు. కానీ బయటకు చెప్పితే పైలట్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని సీక్రెట్‌గా ఉంచింది.   ఆ F-15 జెట్‌లో ఇద్దరు పైలట్లు ఉంటారు. 

  • ముందు కేబిన్ లో ఒక  పైలట్ ఉంటాడు.  అతను జెట్ నడిపుతాడు , ఇంకా టార్గెట్స్ ని గుర్తిస్తాడు
  • ఇంక వెనుక ఒక పైలెట్ ఉంటాడు.  అతను   Weapons Systems Officer (బాంబులు వేయడం, ఆయుధాల నియంత్రణ ఇతను చూసుకుంటాడు.

అలా ఇరాన్ లో కూలిపోయిన అ జెట్ కూలిపోతున్నప్పుడు అ ఇద్దరూ పైలట్లు బయటకు ఎజెక్ట్ అయ్యారు.
వారు ప్యారాచూట్ సాయంతో సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత వారు SERE ని ఫాలో అవుతారు.  అంటే (Survival, Evasion, Resistance, Escape)SERE ని  ట్రైనింగ్ లో భాగంగా నేర్పిస్తారు.

  • ముందుగా గాయాలకు చికిత్స చేసుకోవడం,
  • శత్రువులకు కనిపించకుండా దాకోవడం
  • తమ లొకేషన్‌ను సీక్రెట్ సిగ్నల్ ద్వారా అమెరికాకు పంపించారు

ఈ సిగ్నల్స్ సాధారణంగా శత్రువులకు అర్థం కాకుండా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి.

వారిద్దరూ కిందకి లాండ్ అయ్యాక మొదటి పైలట్ అమెరికాకి సిగ్నల్స్ పంపించాడు.  దాని ప్రకారం అమెరికా హెలికాప్టర్లతో  రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి అతన్ని  వెతకడం ప్రారంభించింది.  అ మొదటి పైలట్ కి కొంత ప్రమాదం జరిగినా, మొదటి పైలట్‌ను సేఫ్‌గా బయటకు తీసుకువచ్చారు.

ఇక రెండో పైలట్ పరిస్థితి చూస్తే.. ఇతను మొదట పైలట్ కన్నా కొంత దూరంలో పడిపోయాడు.  పడిన వెంటనే మొదట స్పృహ కోల్పోయాడు.  అ తర్వాత  లేచి అ దగ్గరలోని ఒక కొండపైకి వెళ్లి, అక్కడ సీక్రెట్ గా దాక్కుని, తాను ఉన్న లొకేషన్ ను అమెరికా కి సిగ్నల్ పంపించాడు.  ఈ   రెండో రెస్క్యూ ఆపరేషన్ చాలా రిస్కీ గా తయారైంది.  ఈసారి అమెరికా మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసింది:  అ ప్రదేశానికి రెండు పెద్ద C-130 విమానాలు పంపింది. అందులో 2 హెలికాప్టర్లు, 100 మంది సైనికులు ఉన్నారు.  వారు అ విమాణాలతో ఒక చిన్న ఎయిర్ ఫీల్డ్‌లో ల్యాండ్ అయ్యారు.  కానీ అక్కడ పెద్ద సమస్య వచ్చింది.  అదేంటంటే అ విమానాలు మట్టిలో ఇరుక్కుపోయాయి!.  అంటే 100 మంది సైనికులు శత్రు దేశంలో ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. అంతకంటే ముందుగా నిజంగానే మన సైనికుడే అ సిగ్నల్స్ పంపించాడా లేక శత్రువులకి దొరికిపోతే వారు ఏమైనా ట్రాప్ చేసి పంపించారా అని సందేహం వచ్చింది.  ముందుగా అ సిగ్నల్స్ మన సైనికుడే పంపించాడు అని నిర్దారణ కి వచ్చాక,  అ పరిస్థితి నుంచి బయట పడేందుకు రెండు తేలికపాటి కొత్త విమానాలను పిలిపించారు,  అతన్ని సేఫ్ గా రక్షించారు.  వెళ్లిపోయే ముందు అమెరికా సీక్రెట్ సమాచారం లీక్ కాకుండా  పాత విమానాలు, హెలికాప్టర్లను అక్కడే ధ్వంసం చేశారు.  చివరికి అందరూ సేఫ్‌గా బయటకు వచ్చారు. ఏప్రిల్ 5 నాటికి ఆపరేషన్ పూర్తయ్యింది.

అయితే ఈ మొత్తం ఆపరేషన్‌పై కొన్ని ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి:

 1. ఒక్క పైలట్ కోసం 100 మంది ఎందుకు?

సాధారణంగా ఒక హెలికాప్టర్ సరిపోతుంది.
కానీ ఇక్కడ పెద్ద స్థాయి ఆపరేషన్ ఎందుకు నిర్వహించారు అని.

 2. ఇస్ఫహాన్ దగ్గరే ఎందుకు?

అందుకంటే అక్కడ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి.

 ఇరాన్ వర్షన్ ఏమంటుంది?  ఇరాన్ వెర్షన్ ప్రకారం

  • ఇది కేవలం రెస్క్యూ ఆపరేషన్ కాదు,  యురేనియం తీసుకెళ్లే ప్లాన్,  F-15 జెట్‌ను టెస్ట్ కోసం పంపారు
  • అ తర్వాత పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేశారు.  కానీ జెట్ కూలిపోవడంతో ప్లాన్ మారిపోయింది అంటోంది.

 

ముగింపు

అమెరికా చెప్పేది:
ఇది కేవలం పైలట్లను కాపాడే ఆపరేషన్.

ఇరాన్ చెప్పేది:
ఇది ఒక పెద్ద గోప్యమైన మిషన్.

నిజం ఏది అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మీరు ఏమనుకుంటున్నారు?
USA చెప్పేది నిజమా?
లేక ఇరాన్ చెప్పేది నిజమా? 🤔

 

ట్రంప్ ని పీకేస్తారా ? | Will Donald Trump be removed ? | FBTV NEWS

Related posts

Leave a Comment