Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

26 న సీఎం కెసిఆర్ సభ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలిరావాలి

0

నాగర్ కర్నూల్,

అచ్చంపేట లో నిర్వహించే సీఎం కెసిఆర్ సభ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలిరావాలనీ లింగాల మండల బీ ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీను నాయక్ అన్నారు.బుధవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సీఎం కెసిఆర్ ఏనో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. లింగాల మండలములో ప్రతి గ్రామం లో సి సి
రోడ్ లు, నూతన గ్రామ పంచాయతి భావనలు, గ్రామంలో వృద్దులకు  వితంతువులకు, ఒంటరి మహిళలకు,2000 పెన్షన్, వికలాంగులకు 4000 పెన్షన్, ప్రతి కుల సంఘాలకు వివిధ రకాల పథకాలు,రైతులకు సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లనీరు, తదితర పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటున్నారని వారు కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26 న
అచ్చంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా లింగాల మండలం నుంచి వేలాది మంది టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు,

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie