Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

27 నుంచి వలంటీర్లచే కులగణన

0

విజయవాడ, నవంబర్ 20, 

డిజిటిల్‌ విధానంలో, మొబైల్‌ యాప్‌ ద్వారా కులగణన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిసి సంక్షేమశాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27వ తేది నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్దేశించింది. దానికి ముందే జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో సదస్సులు నిర్వహించాలని, వీటి నిర్వహణ బాధ్యత సమర్ధవంతమైన యాంకర్లకు, మోడరేటర్లకు అప్పగించాలని పేర్కొంది. దీనికోసం వారికి నగదు పారితోషకం చెల్లించాలని కూడా సూచించింది. దాదాపు మూడు పేజీలున్న ఈ సర్కులర్‌లో వివిధ అంశాలను పేర్కొన్నప్పటికీ కీలకమైన చట్టబద్దత గురించి ఒక పదం కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కేవలం వ్యక్తుల కులానికి మాత్రమే పరిమితం కాదు. వారి సామాజిక, విద్య, ఆర్థిక తదితర అంశాలపై కూడా వివరాలు సేకరించాలి. గతంలో జరిగిన కులగణనలతోపాటు, ఇటీవల బీహార్‌లో జరిగిన కులగణన కూడా ఇదే విధంగా జరిగింది. దీనికోసం వివరాలను పూర్తిస్థాయిలో, పక్కాగా సేకరించాల్సి ఉంటుంది.

ఈ వివరాలను ఒకటికి, రెండుసార్లు సంబంధిత వ్యక్తి చేత ధృవీకరించిన తరువాతే నమోదు చేయల్సి ఉంటుంది. అప్పుడే కచ్చితమైన డేటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి కొంత శ్రమయైనప్పటికీ మాన్యువల్‌ విధానమైతే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సిఎం కార్యాలయ సూచనలతో యాప్‌ ద్వారా కులగణన చేయాలని నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొ న్నారు. దీంతో వివరాలు నమోదు చేసుకోవడం, సరిచూసుకోవడం, ధృవీకరించడం వంటి పనులన్నీ మొబైల్‌ యాప్‌లో చేయాలి. ఏ మాత్ర పొరపాటు జరిగినా తప్పుడు సమాచారం నమోదయ్యే అవకాశం ఉంది. గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ (జిఎస్‌డబ్ల్యుఎస్‌) శాఖ సిబ్బంది చేత ఈ సర్వే నిర్వహించనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొనడంతో వాలంటీర్లను కూడా దీనికోసం వినియోగించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే ఈ తరహాలో నిర్వహించిన కొన్ని సర్వేల సమాచారం అంతగా ఉపయోగకరంగా లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. దీంతో కులగణన కచ్చితత్వంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో నిర్వహించనున్న ఈ సదస్సుల్లో (రౌండ్‌టేబుల్‌- సమావేశాలు) పలువురిని భాగస్వామ్యం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, బిసి, ఇతర శాఖలకు చెరదిన 56 కార్పొరేషన్ల డైరెక్టర్లు, మేధావులు, కుల సంఘాలకు చెరదిన ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలను కూడా సదస్సులో పాలుపంచుకునేలా చూడాలని పేర్కొన్నారు.

అయితే, వక్తలను ఎంపిక చేసే బాధ్యత మాత్రం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ ఎంపిక చేసిన వారికి మాత్రమే సదస్సుల్లో మాట్లాడే అవకాశం ఉంటుందిఈ సదస్సులను నిర్వహించడానికి యాంకర్లు లేదా మోడరేటర్లను ముందుగానే గుర్తించి ఎంపిక చేయడం చాలా ముఖ్యమని సర్క్యులర్‌లో పేర్కొనడం విశేషం. అందుకోసం వీరికి నగదు పారితోషకం చెల్లించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదస్సును ఆకర్షణీయంగా నిర్వహించడంతోపాటు, నిర్దేశించిన అంశానికి పరిమితమయ్యేలా చూడటంలో యాంకర్లు కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie