60 ఏండ్లుగా పూజలు అందుకుంటున్న బోసి కర్ర వినాయకుడు
నిర్మల్
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని తానుర్ మండలం బోసి గ్రామ కర్ర వినాయకుడు గత 60 ఏండ్లుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.గ్రామస్తులు వినాయక నావరాత్రి ఉత్సవాల అనంతరం ఇక్కడి కర్ర వినాయకుడిని తిరిగి భద్రపరచి మట్టి వినాయకులను నిమజ్జనం చేయటం అనవాతి.1967 అప్పటి గ్రామ పెద్దలు బోసి గ్రామంలో ఈ కర్ర వినాయకుడి ప్రతిష్టాపనను ఆరంబించునట్లు ఇప్పుడున్న పెద్దలు చెపుతున్నారు.ఇక్కడి కర్ర వినాయకుడు గత 60 ఏండ్లుగా భక్తుల కోరికలను తీర్చే భగవంతునిగా ప్రసిద్దికెక్కడు. కర్ర వినాయకుడి మహిమ వల్ల తమ గ్రామంలో అనేకులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బోసి గ్రామ కర్ర వినాయకుడు భక్తుల కోరికలను గణపతిగా పూజలందుకొంటున్నాడు సబ్ డివిజన్ పరిధిలోని అనేక ప్రాంతాల భక్తులు ఇక్కడి వినాయకుడి దర్శనానికి వచ్చి ముడుపులు కట్టి మొక్కులు తీర్చు కుంటున్నారు.