హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన ఎన్‌ఎస్‌ఎన్ రాజు తల్లి, భార్య, ఎనిమిది నెలల గర్భిణి అయిన కుమార్తెతో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లో నివసిస్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ముఖానికి నల్ల ముసుగు ధరించిన ఓ ఆగంతుకుడు ఆ ఇంటికి వచ్చాడు. నిచ్చెన సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి కిటకిల నుంచి గదిలోకి ప్రవేశించాడు. ఆ సమయానికి రాజు కుమార్తె నవ్య నిద్రపోతుంది.
దీంతో ఆ ఆగంతుకుడు ఆమె వద్దకు వెళ్లి నిద్రలేపి వెంటనే మెడ మీద కత్తి పెట్టాడు. భయపడొద్దని.. తనకు డబ్బులు కావాలంటూ బెదిరించాడు. అయితే ఆమె ఒంటిపై ఉన్న వజ్రాల చెవిదిద్దులు, అరకిలో బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పిన ఆగంతకుడు వినలేదు. తనకు రూ.20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.అయితే ఉదయం 9.30 గంటలవుతున్నా కుమార్తె గదిలో నుంచి బయటకు రాలేదు. తల్లి లీల వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. కుమార్తె మెడపై కత్తి పెట్టి ఉన్న ఆగంతుకుడిని చూసి ఆందోళనకు గురైంది.
భార్యను గొంతు కోసి కిరాతకంగా చంపిన కానిస్టేబుల్. అడ్డుకోబోయిన కొడుకుపైనా కత్తితో దాడి.
ఇంతలో లీలను గదిలో ఒక పక్కన కూర్చోబెట్టిన దుండగుడు డబ్బులు కావాలని అడగడంతో రూ.2లక్షలు ఇచ్చారు. మరో రూ.8 లక్షలు నవ్య భర్త ఏవీ మనీష్‌రెడ్డి తన స్నేహితుడికి ఇచ్చి ఉదయం 10 గంటల ప్రాంతంలో పంపించారు. ఆ సమయానికి రాజు తన గదిలో నిద్రిస్తున్నారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన ఆగంతకుడు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నవ్య ఫోన్ నుంచి షాద్‌నగర్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకొని పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు 11.30 గంటల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.