Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రిలీజ్‌ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి : ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నాని, దుల్కర్. ఆహ్లాదకరంగా జరిగిన అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్‌ వేడుక.

0

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ శిల్పకలావేదిక లో మదర్స్ డే అయిన ఆదివారం నాడు ఆహ్లాదకరంగా జరిగింది. దర్శకులు నాగ్‌ అశ్విన్‌, అనుదీప్‌, హను రాఘవపూడి, నేచురల్‌ స్టార్‌ నాని, దుల్కర్‌ సల్మాన్‌ ప్రత్యేక అతిథిలుగా విచ్చేశారు.

 

ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, వైజయంతి మా ఫ్యామిలీ లాంటి సంస్థ. వీరితో అవకాశం వస్తే వదులుకోను. రాజేంద్రప్రసాద్‌గారికి నేను ఫ్యాన్‌ ను. మహానటిలో మీ నటనకు  అభిమాని ని. నాని దసరా తో హిట్‌ కొట్టాడు. సంతోష్  ఇందులో చాలా చార్మింగ్‌ గా వున్నావు. కామెడీ టైమింగ్‌ బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ, స్వప్న, నాగి, స్వీటీ వీరంతా నా ఫ్యామిలీ. ఈ సినిమా దర్శకురాలు నందినీ గారు స్పెషల్‌ మూవీ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ లడ్డూలా వుంది. అన్ని శాఖలు బాగా కుదిరాయి. మాళవిక నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం కు మంచి పేరు వచ్చింది. తను మంచి పెర్‌ఫార్మర్‌. గొప్ప నటి. సంతోష్‌ లో చాలా ఈజ్‌ వుంది.

 

కామెడీ టైమింగ్‌ వుంది. నందినికి మరో నాని సంతోష్‌ రూపంలో దొరికాడు. ఈ టైటిల్‌ విన్నప్పుడు చాలా పెద్దగా వుందే అనిపించింది. అలాంటిది స్వప్న ఈ సినిమా టైటిల్‌ ను జనాల్లోకి రీచ్‌ అయ్యేలా కృషి చేశారు. అందరికీ గుర్తుండేలా ఈ సినిమా స్పెషల్‌ మూవీ అవుతుంది. మే 18న మార్నింగ్‌ షోకు వస్తున్నాను. మీరూ రండి. రిలీజ్‌ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి అని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, ఈ సినిమా వల్ల నా కెరీర్‌ లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్‌ ఎక్కాను. ఈ సినిమా ను ఎక్కువ రోజులు చేశాను. ఇందులో హేమాహేమీలు నటించారు. మంచి కథ. ఈ సినిమా మొదటి పోస్ట్‌ర్‌ లోనే వేసవి కాలంలో చల్లటి చిరుగాలి అని వేశాం.

చక్రవ్యూహం’ సినిమా సీడెడ్, నైజాం డిస్ట్రుబ్యూషన్ హక్కులను దక్కించుకున్న “మైత్రి మూవీ డిస్ట్రుబ్యూషన్”

అలాంటి సినిమా మే 18 న విడుదలవుతుంది. సినిమా పరంగా చెప్పాలంటే హిందూసమాజంలో మనం సెంటిమెంట్‌ కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో. చూశాక అద్భుతమైన అనుభూతిని పొందుతారని గ్యారంటీ ఇస్తున్నాను. ఇది థియేటర్‌ కు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్నారు.
నటి గౌతమి మాట్లాడుతూ. సమ్మర్‌ లో కూల్‌ సినిమా అంటున్నాం. కానీ ఫ్యామిలీ లో గొడవలు వున్నాయి. అలాగే అన్నీ అంశాలు వున్న ఈ సినిమా హృదయాన్ని టచ్‌ చేస్తుంది. మే 18 నుంచి అందరికీ అన్నీ మంచి శకునములే అన్నారు. నటి వాసుకి మాట్లాడుతూ, ఈ సినిమాతో 24 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ టీమ్‌ తో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంది. సినిమా బాగా వచ్చింది.

 

షూటింగ్‌ కు వెళితే ప్రతిరోజూ నేర్చుకునేట్లుగా సెట్‌ వుంది. లెజెండ్రీ నటీనటులు నటించారు. ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ, నాకు మొదటగా చెక్‌ ఇచ్చింది ప్రియాక అక్క. మర్చిపోలేను. నాని, దుల్కర్‌ ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా వుంది. నా మొదటి సినిమాను నాని చూసినప్పుడు థియేటర్‌ లో నిలుచొని చూశారు. అదేమిటంటే, తన సినిమా కూడా అలాగే చూస్తానని అన్నారు. ఆయన సపోర్ట్‌ కు థ్యాంక్స్‌. ఇక దుల్కర్‌ సల్మాన్‌ చాలా నార్మల్‌ గా వుంటాడు. నేను సీతారామం మ్యూజికల్‌ ఫేవరేట్‌ అయ్యాను. దుల్కర్‌ రావడం చాలా ఆనందంగా వుంది. హనుగారు, నాగ్‌ అశ్విన్‌ గారు రావడం మరింత ఆనందంగా వుంది. వైజయంతి మూవీస్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. స్వప్న అక్క చాలా హార్డ్‌ వర్కర్‌.

 

నందినీ రెడ్డి గారి దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా వుంది. ఇంతమంది సీనియర్స్‌ తో పనిచేయడం గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. మాళవిక టెర్రిఫిక్ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చింది. ఈ సినిమా చూశాక మీ మనసు తేలికవుతుంది అని అన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, హ్యాపీ మదర్స్‌ డే. ప్రభాస్‌ కు టైటిల్‌ సాంగ్‌ బాగా నచ్చింది. నందినీరెడ్డి సినిమాలు చాలా ఫన్‌ గా వుంటాయి. అలామొదలైందిలో రోహిణిగారు, ఓ బేబీలో రావు రమేష్ గారి సీన్‌ చాలా బాగా డీల్‌ చేశారు. ఈ సినిమాలో చివరి 20 నిముషాల్లో ఎమోషనల్‌, ఫిలాసఫీ వుంది. ఈ కథలో చాలా డెప్త్‌ వుంది అన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, నాని ఇక్కడ అందరికీ కనెక్ట్‌ అయిన వ్యక్తి. దుల్కర్‌ కూడా ఈ బేనర్‌ కు హిట్‌ ఇచ్చాడు. సంతోష్‌ నటన లో చాలా ఈజ్ ఉంటుంది . ఇందులో నటించిన ప్రతి ఒక్కరినీ ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

 

మరో దర్శకుడు అనుదీప్‌ మాట్లాడుతూ, అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. స్వప్న బేనర్‌ కు ఇది మంచి సినిమా కావాలని కోరుకుంటున్నానన్నారు. సీనియర్‌ నరేశ్‌ మాట్లాడుతూ, నా ఫేవరేట్‌ ఆర్టిస్టు నాని. దుల్కర్‌ నాన్నకు నేను ఫ్యాన్‌. వైజయంతి ఫ్యామిలీ తో కృష్ణ గారి నుంచి అనుబంధం వుంది. ఇప్పటి జనరేషన్‌ లో స్వప్న, ప్రియాంక బెస్ట్‌ నిర్మాతలు. నందినీరెడ్డిగారి కమాండ్‌ చూస్తే మా అమ్మ విజయనిర్మలగారు గుర్తుకువస్తారు. అందరూ బాగా నటించారని అన్నారు.
మాళవిక నాయర్‌ మాట్లాడుతూ,  నటిగా నాకు చక్కటి గౌరవాన్ని ఇచ్చారు. ఎవడే.. సినిమా నుంచి మంచి గ్రోత్‌ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ టైమింగ్‌ మోహన్‌లాల్‌ లో చూశాను.

 

వాసుకీ, నరేష్‌ గారు ఇలా అందరితో నటించడం చాలా హ్యాపీగా వుంది. సంతోష్‌ తో నటించడం చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా వేసవికి చిరుగాలి గా వుంటుంది అన్నారు.
నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ, ఆరోజుల్లో నేను గౌతమికి అభిమాని. మా బేనర్‌ లో ఆమెను నటింపజేయాలని చూశాను. కాల్షీట్‌ దొరకలేదు. ఇక అన్నింటికీ మించి దైవసమానులు ఎన్‌.టి.ఆర్‌.గారు మా బేనర్‌ కు నామకరణం చేసి ఆశీర్వదించిన సంస్థ. ఆయన 100వ సంత్సరంలో మా వైజయంతి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ 50 ఏళ్ళ లో అమితాబ్‌, ప్రభాస్‌, దీపికాతో సినిమా తీయడం గొప్ప విషయం.

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04’లో అందాల ‘చిత్ర’గా అలరించనున్న శ్రీలీల.

మా పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఈ సందర్భంగా దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ, నాని తోనే నా సినిమా కెరీర్‌ మొదలైంది. అలా మొదలైంది నాని వల్లే పూర్తయింది. దుల్కర్‌ ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. దత్‌ గారు నాన్నలా పెద్ద దిక్కులా గైడ్‌ చేశారు. షావుకారు జానకి గారి తో పనిచేయడం గర్వంగా వుంది.  అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని అన్నారు.
స్వప్నా దత్‌ మాట్లాడుతూ, మే 18 గొప్ప సినిమా మీ ముందుకు వస్తుంది. మన అమ్మమ్మగారి ఇంటికివెళ్లి మామిడికాయ తిన్నంత హ్యాపీ ఫీలింగ్‌ కలుగుతుంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie