మదనపల్లె
ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పని సరిగా శిరస్త్రానము, పెద్ద వాహనాలు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని పోలీసు అధికారులు సూచించారు. నేడు పట్టణంలోని టుటౌన్ పోలీస్టేషన్ వద్ద నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకత పై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ టుడిపో మేనేజర్ నిరంజన్, ఎస్ఐలు చంద్రమోహన్, రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒక సారి మీ కుటుంబాన్ని మనసులోకి తెచ్చుకుని స్టార్ట్ చేయాలని హితవు పలికారు.