A place where you need to follow for what happening in world cup

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ #BoyapatiRAPO ఫస్ట్ థండర్ బ్లాస్ట్.

0

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని ల మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్  #BoyapatiRAPO ఈరోజు స్టార్ రామ్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఫస్ట్ థండర్ బ్లాస్ట్ అయ్యింది.   థండర్ ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్‌ తో ప్రారంభమవుతుంది. రామ్ తనదైన శైలిలో మాస్ ఎంట్రీ ఇస్తూ సదర్ పండుగ కు ఒక పెద్ద ఎద్దుని తీసుకువస్తాడు. అక్కడ గూండాల గ్యాంగ్ తో మాసివ్ ఫైట్ చేస్తాడు. ప్రతి ఫ్రేమ్‌ లో బోయపాటి స్టాంప్ ఉంది.

 

రామ్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో అదనపు బలాన్ని తీసుకువచ్చారు.రామ్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌ లో కనిపించాడు. పాత్ర కోసం తన శరీరాన్ని బిల్డ్ చేశారు. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…” అనే డైలాగ్ అభిమానులను, మాస్ ని మెప్పిస్తుంది. శ్రీలీల ని కూడా వీడియోలో చూడవచ్చు. సంతోష్ డిటాకే తన ఎక్స్టార్డినరీ కెమెరా పనితనం తో ఆకట్టుకున్నాడు.

రిలీజ్‌ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి : ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నాని, దుల్కర్. ఆహ్లాదకరంగా జరిగిన అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్‌ వేడుక.

ఎస్ఎస్  థమన్ తన థండర్స్ తో కూడిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో విజువల్స్‌ ను ఎలివేట్ చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌  తమ్మిరాజు.  మొత్తానికి ఫస్ట్ థండర్ మాస్ ని ఉర్రూతలూగిస్తోంది.#BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీ, అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది. తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల

Leave A Reply

Your email address will not be published.