Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మెట్టు బండల వద్ద అట్టహాసంగా బీఆర్ఎస్ ప్లీనరీ

0

 

12 తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం

4 తీర్మానాలు ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

కేసిఆర్ అద్భుతదీపం, అభివృద్ధి జ్వాల..

సిద్దిపేటకు అతి త్వరలో రైలు

సిద్దిపేట : ముద్ర
ప్రతినిధి

సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ మెట్టు బండల వద్ద బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ స్థాయి ప్లినరీ చిన్నకోడూరు మండల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు.ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు. సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి అంశాలపై,రాష్ట్రం మీద కేంద్ర బిజెపి సర్కారు చూపుతున్న వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. 8 తీర్మానాలను సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవేశపెట్టగా మరో నాలుగు తీర్మానాలను మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాలను సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చప్పట్ల ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు.

పార్టీ ప్లీనరీలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఈ రోజు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అన్నారు తెలంగాణలో ఆకుపచ్చ చరిత్ర ను రాశారని దీనికి ప్రదానం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ అని మంత్రి చెప్పుకొచ్చారు. క్రియేట్ చేయడం కేసీఆర్ కు కొత్తకాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎంపీ ,కేంద్ర మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశారు.బీఆర్ఎస్ ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది.కేసీఆర్ పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదు.
ఈ రోజు మన రాష్ట్రానికే కాదు,ఇంకో పది ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితికి ఎదిగం.బీఆర్ఎస్ పార్టీ నేత కేసిఆర్ దేశంలో ఎక్కడికి పోయినా అబ్ కి బార్.కిసాన్ సర్కార్ ..అని ఆయా రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ కు జేజేలు పలుకుతున్నారు.కేసీఆర్ ద్వారా తెలంగాణకు ఖ్యాతి, గౌరవం పెరుగుతోంది.ఏనాటికైనా కేసీఆర్ కు తెలంగాణ మీద ఉండే ప్రేమ, మోడీకి ఉంటుందా .. రాహుల్ గాంధీకి ఉంటుందా.. అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.కేసీఆర్ ను తిడితే తినే కంచంలో ఉంచుకున్న ట్లే.. సూర్యుడిపై ఉమ్మి వేస్తే అది మీ మీదే పడతాది.

కేసీఆర్ ను తిడితే తాము పెద్దల్లమైతం అనుకుంటే పొరపాటు, ప్రజల్లో మరింత పలుచన అవుతారు అంటూ ప్రతిపక్షాలకు హితబోధ చేశారు.కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం. కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం మనకుఉండటం వల్లనే అట్టడుగున ఉన్న తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా మార్చాం.నిజాలను ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రచారం చేయాలి, లేదంటే అబద్ధాలు రాజ్యం ఎలుతాయని అంబెడ్కర్ చెప్పాడు.ఒకప్పుడు ఎన్నికల నినాదాలు నేడు కళ్ళ ముందు నిజాలుగా మారాయి.తెలంగాణ రావడం వల్లే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి. 24 గంటల ఉచిత విద్యుత్ వచ్చింది.రైతు బంధు వచ్చింది. రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది. కేసీఆర్ కిట్టు వచ్చింది. మెడికల్ కాలేజీలు వచ్చినాయి. జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. పదవులు వచ్చినాయి. ఇక సిద్దిపేటకు ఒక రైలు మాత్రమే మిగిలింది. మరో మూడు నెలలు రైలు సిద్దిపేటకు వస్తుంది.రాష్ట్రంలో 57 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తూ దేశంలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న రాష్ట్రంగా ఎదిగం అంటూ మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పలాలను వివరించారు..

కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతి ఢిల్లీలో మెచ్చుకుంటారు, ఇక్కడ తిడతారు.మోడీ తప్పులను ఎత్తి చూపితే తిడతారా ?అడిగితే ఈడీలు, ఐటీలు, సిబిఐలను ఉసిగొల్పుతారు.
సమాధులు తవ్వాలని ఒక్కడు, భవనాలు కూలగో డతానని ఇంకొకడు అంటాడు.. కూలగొడితే బొక్కలే ఎల్తాయి పునాదులు తవ్వితే భవనాల నిర్మాణాలు వస్తాయి దీనిపై ప్రజలు
ఆలోచించాలి అంటూ హరీష్ రావు క్యాడర్ కు, ప్రజలను సూచించారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ నేతృత్వంలో చిన్న కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ సిద్దిపేట పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, తుపాకుల బాలరంగం, జంగిటి కనకరాజు, పూజల వెంకటేశ్వరరావు, మోహన్లాల్ ,గుండు భూపేష్ ,కూర మాణిక్య రెడ్డి,ఎద్దు యాదగిరి,మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు ,ఆత్మ కమిటీ చైర్మన్ వంగ నాగిరెడ్డి, కే రామచంద్రారెడ్డి, కూర బాల్రెడ్డి శేఖర్, శ్రీనివాస్, రజనీకాంత్ రెడ్డి, ఎల్లు రవీందర్ రెడ్డి, బాలకిషన్ రావు, కమలాకర్ రావు, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు, మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సొసైటీ చైర్మన్లు సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా నేతలు పాల్గొన్నారు సభకు ముందుగా చిన్నకోడూరు లోను బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి ఎగరవేసి వచ్చారు సభ అనంతరం ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie