పామర్రు
కృష్ణా జిల్లా పామర్రు నియోజవర్గ వైసీపీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం గ్రామంలోని ముందడుగు కాలనీలో అనిల్ కుమార్ నివాసం ఉంది. గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఉదయాన్నే పనిమనిషి సమాచారం ఇవ్వడంతో అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే నివాసానికి పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ మేరకు చోరీ జరిగిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
Next Post