‘ ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనొడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీమహా విష్ణువు మూవీస్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాశ్నిర్మాణంలో ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వంలో దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ మెడికేర్ హాస్పిటల్ లో జరుగుతోంది.
కాగా, సెప్టెంబర్ 10న హీరోయిన్ కేథరిన్ త్రెసా పుట్టినరోజు వేడుకను మియాపూర్ ది ఎలైట్ హోటల్ లో చిత్ర యూనిట్ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్స్ కీర్తిచావ్లా, నిష్మా, దీక్షా పంత్, దర్శకుడు అశోక్ తేజ, నిర్మాతలు దావులురి జగదీశ్, పల్లి కేశవరావు తదితరులు పాల్గొని కేథరిన్ త్రెసాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.