మదనపల్లె
అంతర్ జిల్లా చైన్ స్నాచర్ ను అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు అరెస్టు చూపారు. వివిధ జిల్లాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితున్ని నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద వాహనాల తనిఖీలో భాగంగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు పరారీ అయినట్లు వివరించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు, గంగాభవాని నగర్ కు చెందిన జాకీర్ హుస్సేన్ కుమారుడు షేక్ ముస్లిం వాల్మీకిపురంలో వివాహం చేసుకున్నాడన్నారు. సమీప ప్రాంతాల్లోని మరో నిందితులతో కలిసి పలుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డుతున్నట్లు తెలిపారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 22 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 82 గ్రాముల బంగారు చైన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిమ్మనపల్లె ఎస్సై ఫాతిమా ఉన్నారు.