Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నల్గోండ కాంగ్రెస్ లో గందరగోళం

0

నల్గోండ, ఏప్రిల్ 25:తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నేతల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరుతోంది. పరస్పరం చెక్‌ పెట్టుకునే పనిలో ఉన్నారు అంతా. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ వార్‌లో మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంతో కలిసి సై అంటున్నారట. ఈ ముగ్గురి మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తోంది. రేవంత్‌కి చెక్‌ పెట్టడానికి ఉత్తమ్ శిబిరం… ఉత్తమ్ శిబిరాన్ని ఆపడానికి రేవంత్ వర్గం ఎప్పటికప్పుడు పావులు కదుపుతూనే ఉన్నాయి. నల్గొండలో ముందు నిరుద్యోగ నిరసన సభ వాయిదా పడడం… ఆ తరువాత తేదీని ఖరారు చేయడం వెనక కూడా ఎత్తుగడలు ఉన్నాయట. ఈనెల 28న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన సభను నిర్వహించాలని డిసైడ్ అయింది టి కాంగ్రెస్‌. ఉత్తమ్…

రేవంత్ మధ్య ఉన్న గ్యాప్‌ని తగ్గించేందుకు ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ ఇలా సయోధ్య కుదిర్చారట.నల్గొండ సభ ప్రకటన వెనక రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా వ్యవహరించారన్న చర్చ పార్టీలో జరుగుతోందట. ప్రస్తుతం ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓడిపోవడంతో తర్వాత భువనగిరి లోక్‌సభ సీటులో పోటీ చేసి గెలిచారు. దీంతో లోకల్‌ ఎంపీ గనుక ప్రస్తుతానికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉత్తంకుమార్ రెడ్డి పరిధిలోకి వెళ్ళింది. ఈ లెక్కన నిరుద్యోగ సభ నిర్వహణకు సంబంధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఉత్తమ్‌తో చర్చించి తేదీలను ప్రకటించి ఉండాల్సింది. అందుకు తగ్గట్టే తాము సమాచారం ఇచ్చామని రేవంత్‌ వర్గం చెబుతుంటే…. ఉత్తంకుమార్ రెడ్డి మాత్రం నాకేం తెలియదంటున్నారు.

పీసీసీ చీఫ్‌ని ఇప్పటిదాకా నల్గొండకు రాకుండా అడ్డుకుంటున్నారు ఉత్తమ్‌. అదే విషయాన్ని సభ పేరుతో తెరమీదికి తెచ్చి చర్చ పెట్టిందట రేవంత్‌ టీం. ఎంపీగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్నగర్. అలాగే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్గొండ. అంటే.. ఈ ఇద్దరు నాయకుల చేతిలోనే జిల్లా పార్టీ మొత్తం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా.. ఈ ఇద్దరి పరిధిలోకే వస్తుంది. దీంతో వాళ్ళని కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇద్దరు ఎంపీల సొంత నియోజకవర్గాలను ఫిక్స్‌ చేసేందుకే పీసీసీ చీఫ్‌ కొత్త ఎత్తుగడ వేశారంటున్నాయి పార్టీ వర్గాలు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నాదే అంటూ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తామని ప్రకటించేశారు కోమటిరెడ్డి. ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌గనర్‌కు వెళ్తారా? లేక తిరిగి నల్గొండ ఎంపీగా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

అలా ఇద్దరు నాయకులని ఏదో ఒక నియోజకవర్గానికి ఫిక్స్ చేసే ఎత్తుగడలో రేవంత్ ఇలాంటివి వ్యూహాన్ని వేశారా..? అనే చర్చ కూడా నడుస్తోందట పార్టీలోమునుగోడు ఉప ఎన్నిక టైంలో మొత్తం బాధ్యత పీసీసీ అధ్యక్షుడిదేనని.. అన్నీ ఆయనే చూసుకోవాలని చెప్పిన నేతలు… సమస్యలపై ఆందోళన చేసే విషయంలో మాత్రం తమ పరిధి అని చెప్పడం ఏంటన్నది రేవంత్ శిబిరం నుంచి వస్తున్న ప్రశ్న. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు జరిగినా పట్టించుకోని నేత పీసీసీ చీఫ్ గా జిల్లాకు వెళ్తానంటే అభ్యంతరాలు చెప్పడం ఏంటన్నది రేవంత్‌ వర్గం ప్రశ్న. ఇప్పుడు సభ ద్వారా ఆ విషయాన్ని చర్చకు పెట్టగలిగామనుకుంటున్నారట ఆ వర్గం నాయకులు. మరోవైపు పీసీసీ చీఫ్‌గా కార్యక్రమాలు ప్రకటించే స్వేచ్ఛ ఉంటుంది.. కానీ ఎక్కడ నిర్వహిస్తున్నారో… స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదంటున్నారు పార్టీలో కొందరు సీనియర్లు.. ఏదేమైనా…

తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురు నాయకుల మధ్య ఎత్తులు పై ఎత్తులు కొనసాగుతున్నాయి. సందు దొరికితే చాలు… ఒకరికొకరు చెక్ పెట్టుకునే పనిలో ఉన్నారు. నాయకుల మధ్య పంచాయతీతో క్యాడర్‌లోగందరగోళం పెరుగుతోందటతెలంగాణ కాంగ్రెస్‌లో మూల స్తంభాల్లాంటి నాయకుల మధ్య పెరుగుతున్న పోరు ఎందాకా వెళ్తుందో…. ఎన్నికల టైంలో పార్టీని ఎటు తీసుకువెళ్తుందోనన్న టెన్షన్‌ కార్యకర్తల్లో పెరిగిపోతోందట. ఎన్నికల ఏడాదిలో అందర్నీ కలుపుకుని పోవాల్సిన వారే… ఇలా కలహించుకుంటుంటే… ఇక అధికారం గురించి ఆలోచన వస్తుందా అని అంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. పీసీసీ మిగతా నాయకుల్ని కలుపుకుని పోవడం లేదా? లేక మిగతా వారే పీసీసీతో కలిసి రావడం లేదా అని చర్చించుకుంటున్నాయట పార్టీ వర్గాలు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie