Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కరాటే కళ్యాణి వర్సెస్ బీఆర్ఎస్.

0

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో విగ్రహం ఏర్పాటుచేస్తే అడ్డుకుంటామని హిందూ, యాదవ సంఘాలు, కరాటే కల్యాణి అంటున్నారు. అయితే కరాటే కల్యాణి ఫెయిట్ ఆర్టిస్ట్ లతో రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం రూపొందడంపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

 

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే కృష్ణుడి రూపంలో పెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రయోజనం మేరకు విగ్రహం ఏర్పాటుచేస్తున్నారని, యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని కరాటే కల్యాణి ఆరోపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటామని అంటున్నారు.ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించాలని ఫాన్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమ వంతుగా సాయం అందిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తున్నారు. ఈ విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గోనున్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు కొందరు వివాదాలు సృష్టిస్తున్నారు. శ్రీ కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు, కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విగ్రహం ఏర్పాటుచేస్తున్నారని సినీనటి కరాటే కల్యాణి ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు హిందూ, యాదవ సంఘాల సభ్యులు ఆందోళన చేశారు. ఎన్టీఆర్‌కి విగ్రహం పెడితే అందరికీ సంతోషమేనన్న ఆమె…కానీ కృష్ణుడు రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వచ్చే తరాల వారు ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడు అనుకునే పరిస్థితి వస్తుందన్నారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును మంత్రి పువ్వాడ ఆపాలని, లేకపోతే తామే అడ్డుకుంటామని కరాటే కల్యాణి, యాదవ సంఘాలు హెచ్చరించాయి.

హాట్ టాపిక్ గా మారిన బాలినేని..

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో ఎవరి మనోభావాలు దెబ్బతినలేదని కరాటే కల్యాణి యాదవ సంఘం ముసుగులో కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీఆర్ఎస్ యాదవ ప్రతినిధులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకు వచ్చి ఖమ్మంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఖమ్మంలో ఉన్న యాదవులను ఆమె సంప్రదించలేదన్నారు. ఆమె వెనుక ఎవరో ఉండి రాజకీయ కుట్ర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సూట్ కేసుల్లో డబ్బులు తీసుకొని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie