Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆహుతి సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు

0

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి స్నిగ్ధ రెడ్డ, మాట్లాడుతూ. దేశ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఈ నెల 9వ తేదీనా 6:30 గంటలకు గద్వాల తేరు మైదానంలో
ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన దేశ కళలు, సాంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది.
ఇందులో భాగంగా మన గద్వాల్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతోపాటు, యువతకు వాటి పట్ల ఆసక్తి కనబరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమం నృత్యగ్రామ్ డాన్స్ ఎన్సెంబుల్ చిత్ర సేన డాన్స్ కంపెనీ వారు శ్రీలంక కళాకారుల చేత నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తమ ప్రాంతంలో నిర్వహిస్తే ఎంతో బాగుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, వెంటనే స్పందించి ఈ కార్యక్రమ నిర్వహణపై అనుమతి ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో గద్వాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడంతోపాటు రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాల విలువలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు క్రిష్ణవేణి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాల్వాయి రాముడు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.