Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

‘’నారాయణ & కో ‘ నుంచి దండక డన్ డన్ పాట

0

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ రోజు ‘’నారాయణ & కో ‘ మ్యూజిక్ జర్నీ స్టార్ చేశారు. ఈ చిత్రం నుంచి దండక డన్ డన్ పాటని విడుదల చేశారు. ఫుల్ పైసా వసూల్ సాంగ్ ఇది. నాగ వంశీ ఈ పాటని క్యాచి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఫుల్ ఎనర్జిటిక్ గా పాడారు. పూర్ణచారి లిరిక్స్ అందించారు.

ఈ పాట కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్ గా వుంది. లాటరీ తగిలిన ఆనందంలో ’నారాయణ & కో’ కింగ్స్ లా ఫీలవుతూ రాజుల వస్త్రాధారణలో హంగామా చేయడం ఆకట్టుకుంది. ఈ పాటలో సుధాకర్ కోమాకులతో పాటు , దేవి ప్రసాద్, ఆమని, దాదాపు ‘నారాయణ అండ్ కో’ అంతా సందడి చేసింది.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్ సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్. రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ , శరద్ గుమాస్టే అసోసియేట్ ప్రొడ్యూసర్.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie