A place where you need to follow for what happening in world cup

HOT NEWS

రాష్ట్రంలో రాక్షస పాలన

0

తిరుపతి:రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను భంగపరుస్తున్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, సేవ చేసేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డిపై 11 ఛార్జీషీట్లు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అవినీతి మయం, అక్రమార్జన. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన జరుగడం దురధృష్టకరం. రూల్ ఆఫ్ లా ను చేతుల్లోకి తీసుకున్నారు. పాదయాత్ర ఎవరైనా చేసుకోవచ్చు… మైక్ లాక్కోవడం , స్టూల్ ను లాక్కోవడం లాంటి పనులు ఏపీలోనే చూస్తున్నాం. మీడీయాను నియంత్రిస్తున్నారు. రాజ్యాంగానికి లోబడే పాలన ఉండాలి…. అందుకు విరుద్ధంగా ఏపీలో పాలన నడుస్తోందని అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి, చంద్రబాబు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ పాదయాత్రలు చేసినా ఎవరూ అడ్డుకోలేదు. రాజ్యాంగమే దేశానికి ప్రధానం. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల అవగాహన లేదు, రాజ్యాంగ విరుద్ధంగా నియామకమైన సలహాదారుల సలహాలతో పాలన నడుస్తోంది. ఇసుక, మద్యం, మైన్స్ ను దోపిడీ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మనుషులే సహజ వనరులను దోపిడి చేస్తున్నారని అన్నారు.రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకువచ్చింది. ఒక్క కంపెనీ పేరు చెప్పగలరా. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగింది. వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ళ పాలనలో ఒక రూపాయి పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చారా. ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్ఠం లేదు. వాలంటీర్ ఉద్యోగాలు వైసిపి కార్యకర్తలకు ఇచ్చారు. బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. పేద వర్గాలను నిండా అప్పుల ఊబిలోకి నింపుతున్నారు. దేశంలో ఏపీ పేదరికం, అరాచకం, అక్రమాలలో ముందుందని అన్నారు.

రాష్ట్రంలో అప్పులు .11 లక్షల కోట్లు అప్పు ఉంది. రాష్ట్రానికి తీసుకువచ్చిన అప్పులు ఏమయ్యాయి. వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబు కు సంబంధం ఏమిటి. వివేకానంద రెడ్డి హత్యను ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. వివేకానంద రెడ్డి హత్యను జగన్మోహన్ రెడ్డి చేయించారని త్వరలో నిరూపణ కానుంది. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పాదయాత్రలో వచ్చిన ప్రజల సమస్యలను టిడిపి మ్యానిఫెస్టోలో చేర్చుతాం. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదానీ కంపెనీలలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉండడం వల్లే ఏపీలో ముందుకు వస్తున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.