- జాతీయ పథకం ఎగురవేసేటప్పుడు కనీసం గౌరవించడం తెలియని ఈ బీజేపీ నాయకులు మనకు అవసరమా??
- భారత రాజ్యాంగం ద్వారానే ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన విషయాన్ని మరిచిన డీకే అరుణ
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకోసం ఏర్పడింది, దీనికి ముఖ్య కారకులు ఎవరు అన్న సంగతి బిజెపి శ్రేణులకు తెలియకపోవడం బాధాకరం, కేంద్ర బిజెపి మహిళా నాయకురాలు నేతృత్వంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటం లేకుండా జెండా విష్కరణ చేయడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల వీరికి ఎంత గౌరవం చిత్తశుద్ధి వుందో ఈ కార్యక్రమం ద్వారా ఇట్టే సాక్ష్యంగా తెలుస్తుందని అంబేడ్కర్ వ్యతిరేకులను, వారీ కుట్రలను గమనించాలి.
చెప్పులేసుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న బిజెపి సైన్యం. అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, యస్ టీ, బీసీ, మైనారిటీ ప్రజలరా గమనించండి రాజ్యంగ నిర్మాత ఫోటో లేకుండా చేస్తున్నారంటే, రాజ్యాంగమే వీరికి ఇష్టం లేనట్టుంది
మీ హక్కుల కొసం పోరాడి సాధించిన వ్యక్తీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, అంబేడ్కర్ గారి రాజ్యాంగం కనుమరుగు అయితె బీసీ, ఎస్సీ, యస్ టీ, మైనారిటీలకే, ప్రమాదం. బిజెపి పార్టీలో వుండే దళిత సోదరులు ఇప్పటికైనా దళితుల పట్ల దళితుల ఆత్మగౌరవం పట్ల అన్నిటికీ మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల బిజెపి పార్టీ నాయకులకు ఎంత గౌరవం చిత్తశుద్ధి వుందో తెలుసుకోవాలి.
రాజ్యంగా రక్షణ నేటి మన అందరి కర్తవ్యం కావలని, పంద్రాగస్టు జనవరిలని జాతీయ పండుగలుగా జరుపుకుంటాం మనం. ఆసేతు హిమాచలం భారత జాతి యావత్తు ఈ రోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నదని అయితే రెండు పండుగల మధ్య తేడా మాత్రం చాలా కీలకమైనదని పంద్రాగస్టు మన దేశానికి స్వాతంత్రం తీసుకువస్తే. ఆ స్వాతంత్రం రాజులు, మహరాజులు, ధనికస్వాములకే కాకుండా. దేశ ప్రజలందరికీ చెందేట్టుగా చేసింది మాత్రం జనవరి26 జనవరి 1950న సర్వ సత్తాక ప్రజాతంత్ర రిపబ్లిక్ గా మన దేశం అవతరించడానికి కారకులయిన అంబేడ్కర్, తదితర మహనీయులకు వందనాలు అర్పిస్తూనే. వారి నాటి కృషిని నిష్ఫలం చేయడానికి నేడు చేస్తున్న ఈ బీజేపీ కుట్రలను ఎదుర్కోవడానికి దేశప్రజలు సమాయత్తం కావాలి.