కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ మేరకు ధరలతో పాటు టూర్ వివరాలను పేర్కొంది.సమ్మర్ వచ్చిందంటే చాలు.. వేర్వురు సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే… మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చని టూరిజం శాఖ ప్రకటించింది . ఈ టూర్ ప్యాకేజీలో రామప్పలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, మేడిగడ్డ బ్యారేజీ, కనేపల్లి పంప్ హౌజ్, కాళేశ్వర ఆలయంతదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.ప్రతి శనివారం, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి 5 గంటలకు బస్సు బయలుదేరుతుంది. వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు 8 గంటలకు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం ఉంటుంది.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ , కనేపల్లి పంప్ హౌజ్ , సందర్శిస్తారు. అక్కడనుంచి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ట్రిప్ ముగుస్తుంది.అతి తక్కువ ధరలోనే ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది తెలంగాణ టూరిజం శాఖ. పెద్దలకు రూ.1850, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1490 ధరగా నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, దర్శనం, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.Toll Free: 1800-425-46464 ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.