మంత్రి సమక్షంలో బి.ఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్, మాజీ జడ్పీటీసీ
Ex-Councillor, Ex-JDPTC who joined BRS in the presence of the Minister
మెదక్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అంకం చంద్రకళ రవి యాదవ్ మంత్రి హరీష్ రావు,
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నుంచి బిఆర్ఎస్ లో చేరారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మెదక్ మండలం మాజీ జడ్పీటీసీ కిషన్ గౌడ్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ యం.దేవేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ పట్టణ, మెదక్, హవేళిఘనాపూర్ మండలాల , పార్టీ అధ్యక్షులు యం.గంగాధర్, యం. అంజాగౌడ్, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు, నాయకులు లింగారెడ్డి, రవీందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.