Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆదర్శప్రాయుడు డా.బాబు జగ్జీవన్ రామ్…

0

దేశానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆదర్శనీయుడని, అమహనీయుడిని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జడ్పి చైర్మన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు .బుధవారం డా జగ్జీవన్ రామ్ 116 వ జయంతి పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని డా. బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా లో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు జడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జడ్పి చైర్మన్ ఎస్పీ, అదనపు కలెక్టర్ లు, ఆర్డీవో, మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.సంఘసంస్కర్తగా, బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని అన్నారు. జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని ,సిఎం కేసిఅర్ డా బాబు జ‌గ్జీవ‌న్ రామ్ స్ఫూర్తితో తెలంగాణ లో సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలు అమ‌లు చేస్తున్నారని అన్నారు. ఎస్సీ ల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ద‌ళిత‌బంధు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుందన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూదేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్కర్త‌, భార‌త మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర కు ముందు, ఆ తర్వాత కూడ వివక్ష లేని సమ సమాజం కు కోసం కృషి చేశారని కొనియాడారు.డా. బి ఆర్ అంబేద్కర్ తో కలిసి
బాబు జ‌గ్జీవ‌న్ రామ్ అణగారిన వర్గాల రిజర్వేషన్ ల సాధన కోసం కృషి చేసి, విజయం సాధించారనీ అన్నారు. వారి కృషి వల్లే బడుగు, బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని అన్నారు.

అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ…డా బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధాని గా, అనేక శాఖల కు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిoచి దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…డా బాబు జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంత గానో కృషి చేశారని కొనియా డారు. వారి పుట్టిన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, డీఆర్ఓ టి.శ్రీనివాస రావు,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య,జిల్లా బీసీ, ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం , జిల్లా సంక్షేమ అధికారి రాజారాం, మైనారిటీ సంక్షేమ శాఖ ఒఎస్డి సర్వర్ మియా, తహశీల్దార్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ లు, ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie