Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఫీల్డ్ లెవల్ వర్క్స్ బేష్

Field Level Works Bash

0

స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్

డిల్లీ లెవల్ లో ఉన్న పేపర్ రిపోర్ట్ కంటే ఫీల్డ్ లెవల్ లో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు చాల గొప్పగా జరిగాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ అన్నారు. గురువారం స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ పరిదిలో జరిగిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రత్యేక పర్యవేక్షణ కోసం ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ కరీంనగర్ లో పర్యటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కమీషనర్ సేవా ఇస్లావత్, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ అధికారులు, వివిధ ప్రాజెక్టుల ఏజెన్సీ కాంట్రాక్టర్లతో కలిసి 49 స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు ల వారిగా జరిగిన పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి ప్రాజెక్టు రిపోర్టు ప్రోగ్రెస్ వివరాలను సేకరించారు.

ప్రాజెక్టుల వారిగా పనులను నిశితంగా పరిశీలించిన స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ పూర్తైన ప్రాజెక్టు పనుల పురోగతి పై సంతృప్తిని వ్యక్తం చేశారు. పర్యవేక్షించిణ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో మేయర్ యాదగిరి సునీల్ రావు అద్యక్షతన, కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజిట్ చేసిన ప్రతి ప్రాజెక్టు వారిగా సమావేశం సూదీర్ఘంగా చర్చించి పూర్తైన ప్రాజెక్టు పనుల పై పాలకవర్గం, అధికారులను అభినందిస్తూ సంతృప్తిని వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టు పనుల వేగవంతం పై అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లకు సలహాలు, సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి సమావేశంలో స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ తో పోలిస్తే కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ పరిదిలోనే ప్రాజెక్టుల పనులు చురుకుగా చాలా మెరుగ్గా సాగాయన్నారు.

49 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని 10 శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. డిల్లీ స్తాయిలో కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో చెపట్టిన స్మార్ట్ రోడ్లు, డ్రైనేజీ లు, ఫుట్ పాత్ లు, పార్కులు, తదితర ప్రాజెక్టుల పనులు పూర్తి కాక బయోమైనింగ్, మల్టిపర్పస్ పార్క్, ఈ క్లాస్ రూం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 31 టార్గెట్ గా పెట్టుకొని పెండింగ్ ప్రాజెక్టు పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లను కోరారు. వరంగల్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ కంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ పరిదిలో ఇంత త్వరగా గొప్పగా పనులు పూర్తి కావడం నాకు సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కున్న మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్, అధికారులు, ఏజెన్సీ కాంట్రక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనులను చురుగ్గా కొనసాగించడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మరో వైపు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ చేసి ఫీల్డ్ లెవల్ లో పనులు గొప్పగా జరిగాయని అభినందించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా మల్టిపర్పస్ పార్క్ ప్రాజెక్టు ఏజెన్సీ కాంట్రాక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిన పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా బయోమైనింగ్, ఈ క్లాస్ రూం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టు పనులను కూడ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఫీల్డ్ లెవల్ లో ప్రాజెక్టు పనులు గొప్పగా జరిగాయని వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ తెలుపడం చాలా హర్షనీయమన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, మహేంధర్, డీజల్, ఏఈలు, స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie