A place where you need to follow for what happening in world cup

మార్చి 17న వైసీపీ అభ్యర్ధుల ఖరారు…?

0

విజయవాడ, ఫిబ్రవరి 10, 
మార్చి 17 వైసీపీ ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు వాళ్ల పని తీరుపై ప్రోగ్రెస్ కార్డు ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. కొన్ని సీట్లలో అభ్యర్థులను కూడా ఖరారు చేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు ఆయా నియోజవర్గాల్లో ఇంటింటికీ వెళ్తున్నారు. ఇంకా చాలా మంది వెళ్లడం లేదని ఈ మధ్య జరిగిన సమీక్షల జగన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు మార్చిలో జరిగే సమావేశంలో వారి ప్రోగ్రెస్ చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా గెలుపు రేసులో ముందంజలో ఉన్న వారిని అభ్యర్థులుగా ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యర్థుల ఎత్తుగడను బట్టి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే దీన్ని మరికొందరు నేతలు ఖండిస్తున్నారు. జగన్‌కు ముందస్తు ఆలోచన లేదని… పని చేయని వారి ప్లేస్‌లో వేరే వాళ్లను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. పని తీరు బాగోని వారికి నచ్చచెప్పి మారుస్తారని టాక్ వినిపిస్తోంది. అదే టైంలో పక్క చూపులు చూస్తున్న వారి స్థానంలో కూడా కొత్త వారిని తీసుకొస్తారట. అధికార పార్టీలో సీట్లకు డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరసం లేదు. అందులోనూ వై నాట్ 175 టార్గెట్‌తో ముందుకు వెళుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో సీట్ల పంచాయితీపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. 175 నియోజకవర్గాల్లో దాదాపుగా పాత వారే కంటిన్యూ అవుతారని అధినేత గతంలో గతంలో అనేక సార్లు అనేక వేదికలపై స్పష్టం చేశారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గుర్తు చేస్తున్నారు.

మీ అందరని మరలా చూడాలనుకుంటున్నానని, అందరూ కష్టపడి పని చేస్తే తిరిగి అధికారం మనదే అని జగన్ పిలపునిచ్చారు. దీంతో దాదాపుగా అందరూ తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుందని భావించారు.అయితే ఎన్నికలకు సంబంధించిన సీజన్ మొదలవటంతో ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసన సభ్యులు రెబల్స్‌గా మారిపోతున్నారు. పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు ఎప్పుడో రెబల్ అయ్యారు. అధికార పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించటం, వైఫల్యాలను బయటకు తీసుకురావటంతోపాటుగా అవీనీతి ఆరోపణలు కూడా చేయటం సంచలనంగా మారింది. అయితే కాల క్రమంలో మరింత మంది నేతలు అధికార పక్షానికి వ్యతిరేకంగా బయటకు రావటం చర్చనీయాశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురేలేదనుకున్న నెల్లూరు జిల్లాలో వ్యతిరేక రాగాలు వినిపించటం మొదలయ్యాయి.

జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో సంచలన కామెంట్స్ చేయటం, ఆయనకు మద్దతుగా మరికొందరు నాయకులు మాట్లాటడటం పార్టీని ఇరుకన పెట్టింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కోటం రెడ్డి వ్యవహరంపై పార్టీ నేతలతో పంచాయితీ చేసి మరి ఎంపీ ఆదాలను రంగంలోకి దించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యవహరం సంచలనంగా మారటంతో అదే జిల్లా నుంచి ఉదయ గిరి శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటురావటంతో ఆ వ్యవహరం కాస్త పక్కకు వెళ్లింది. అంతర్గతంగా కూడా ఈ వ్యవహరం పార్టీ శాసన సభ్యులపై తీవ్ర ప్రభావం చూపిందని నాయకులు అంటున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతోపాటుగా ఇతర నేతల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారనే ప్రచారం మొదలైంది. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీలో వారసుల వ్యవహరం కూడా చర్చనీయాశంగా మారింది.

ఇప్పటి వరకు ఉన్న శాసన సభ్యుల్లో కొందరు తమ వారసులకు టిక్కెట్‌లను ఇప్పించే అంశంపై జగన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం మొదలవటంతో వారసులకు టిక్కెట్‌లను ఇప్పించాలనే నేతలు కూడా కాస్త ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారసులకు టిక్కెట్ దక్కకపోతే ఎంచేయాలనే విషయాలను కూడా పార్టీ నేతలు స్వయంగా ఫోన్‌లో మాట్లాడారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహరంపై వివాదం నెలకొన్న సమయంలో ఇది నాయకులను గందరగోళానికి గురి చేస్తుందనే టాక్.ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే మార్చిలో వైఎస్‌ జగన్ నిర్వహించే సమావేశంలో ఏం చెప్తారు, ఏం చేస్తారనే ఊహాగానాలు చాలానే ఉన్నాయి. సమస్యలేని నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతలో కొందరి ఆశావాహులకు ఎమ్మెల్సీలు ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో కొందరి అసంతృప్తిని కంట్రోల్ చేసి.. పోటీ చేసే అభ్యర్థులకు లైన్ క్లియర్ చేయవచ్చని వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.