రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీని పట్టివేసారు. హైదరాబాద్ నుండి షార్జా వెళుతున్న జీన్ అల్నేసా అనే మహిళా ప్రయాణికురాల వద్ద నుండి 44.480 లక్షల విదేశీ కరెన్సీ ని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు అరబ్ దేశస్థురాలుగా గుర్తించారు. కరెన్సీని, నిందితురాలిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఆమె హ్యాండ్ బ్యాగేజీలో విదేశీ కరెన్సీ ని ఎయిర్పోర్ట్ భద్రత సిబ్బంది గుర్తించారు.