A place where you need to follow for what happening in world cup

జేడీ లక్ష్మినారాయణ రాజకీయ పయనం ఎటు వైపు.

0

సీబీఐ మాజీ జేడీ, మాజీ జనసేన నేత వీవీ లక్ష్మినారాయణ రాజకీయం భిన్నంగా సాగుతోంది. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఏ పార్టీలో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు. ఇటీవల విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.

 

అందుకే ఆయన సోషల్ మీడియా ప్రకటనలు తరచూ భిన్న చర్చలకు కారణం అవుతున్నాయి. చంద్రబాబునాయుడు విజన్ ను అభినందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన సూచనలకు  మద్దతిచ్చారు. జేడీ లక్ష్మినారాయణ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. టీడీపీలో చేరుతారా అన్న చర్చ ప్రారంభణయింది. అయితే ఇంతకు ముందే చుక్కల భూముల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జగన్ నూ ప్రశంసించారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వైసీపీలో చేరుతారా అని చెప్పుకున్నారు. అంతకు ముందు స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు బీఆర్ఎస్ చీఫ్ పైనా ప్రశంసలు కురిపించారు.

సునీత, రాజశేఖర్ ల స్టేట్ మెంట్ రికార్డు.

బీఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిగాయని అప్పటికే ప్రచారం జరగడంతో ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అనుకున్నారు. కానీ అన్ని పార్టీలనూ లక్ష్మినారాయణ పొగుడుతున్నారు కానీ..ఎవర్నీ విమర్శించడం లేదు. పవన్ కల్యాణ్ సినిమాలు చేయనని చెప్పారని.. పార్టీని వదిలేసి సినిమాలు చేస్తున్నందున తాను జనసేనకు రాజీనామా చేశానని గతంలో ప్రకటించారు.. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ .. అన్ని పార్టీల నేతల్నీ ఆయన పొగుడుతున్నారు. ఆయన తెలివిగా రాజకీయం చేస్తున్నారని కొంత మంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.