జలుమూరు మండలం పర్లాం గ్రామం సమీపంలో గల ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా డంపింగ్ పేరుతో పట్టపగలు రాత్రి అనే తేడా లేకుండా ఎటువంటి పరిమిట్లు లేకుండ సుమారు 10 టిప్పర్లు, 3 ప్రోక్లేన్లతో యాదేచ్చగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణను మాజీ ఎమ్మెల్యే రమణమేర్తి అడ్డుకున్నారు. లారీలను ఆపివేసారు. సిబ్బందిని ప్రశ్నించగా తమకు ఎటువంటి పరిమిసన్లు లేవు అనడంతో వెంటనే అధికారులు, పోలీసులు, ఎస్సీబీ, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు స్పందించకపోవడంతో సుమారు ఎండలో రెండు గంటలు నిరసన చేపట్టారు.
ఎంతటి వారైనా సిబిఐ ముందు సమానులే.
అధికారులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ ఇసుక మాఫియాలో ఉన్నది ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారని మంచి పద్ధతి కాదని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసారు. రాష్ట్రంలోనే మట్టి, ఇసుక,కొండలు, గనులు అక్రమ తవ్వకాలు చేపట్టి మాఫియాలో జరుగుతుంటే నియోజకవర్గంలో దానికి పది రెట్లు కొండలు ఇసుక, గనులు మాయమవుతున్నాయి అని ఎవరైతే ఈ మాఫియా వెనకున్నారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు డిమాండ్ చేసారు.