హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సర్వసభ సమావేశం కర్మన్ ఘాట్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల పై త్వరలో నే కేటీఆర్ ను కలిసి సమస్యలను వివరిస్తామని ఎల్బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వర్ణకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ స్వర్ణకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవచారి కోరారు.
స్వర్ణకారుల సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనుకాడ బొము అని స్వర్ణకారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశ్వకర్మల కోసం అసెంబ్లీలో ప్రకటించిన 250 కోట్లు ఇప్పటివరకు రాలేదని అన్నారు. కార్పొరేట్ సంస్థల వల్ల చేతులు వారు దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. నాలుగు నెలల్లోని 11 మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పరిష్కారానికి చోరువ తీసుకోవాలని కోరారు.