Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గద్వాల అభివృద్ధికి బాటలు వేద్దాం- గొంగళ్ల రంజిత్ కుమార్

0

జోగులాంబ గద్వాల్ : 18వ రోజు మల్దకల్ మండలంలో జన సంద్రంతో కదిలిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర. గద్వాల మండలంలోని గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో 18వ రోజు కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర సోమవారం ఉదయం మల్దకల్ మండలం పాల్వాయి, పెద్దపల్లి, బూడిదపాడు గ్రామం వరకు కొనసాగింది. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత సాయంత్రం అమరవాయి, సద్దలోనిపల్లి, మంగంపేట, మల్దకల్ మండల కేంద్రం మీదుగా పాదయాత్ర కొనసాగింది. అలాగే నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా పాల్వాయి, అమరవాయి, సద్దలోనిపల్లి, గ్రామస్తులు మహిళామణులు హారతులు పట్టి వీరతిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. బూడిదపాడు గ్రామంలో గొంగళ్ల రంజిత్ కుమార్. తాపీపట్టి మెస్త్రీపని చేశారు. మల్దకల్ మండల కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు గజమాల సమర్పించి ఘన స్వాగతం పలికారు.

అమరవాయి గ్రామంలోని గొంగళ్ల రంజిత్ కుమార్. ఎడ్లతో పొలాన్ని దుక్కి దున్నారు. అనంతరం అమరవాయి గ్రామంలో గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు ఎడ్లబండిపై పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బిఆర్. అంబేద్కర్. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 18వ రోజు కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రకు పెంచికలపాడు,ఇందువాసి,నీలహళ్లి ఇతర గ్రామాల ప్రజలు పాల్గొని నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర కు సంఘీభావం, మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ..

రాబోయే రోజుల్లో గద్వాల ప్రాంత అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలను చైతన్యం చేయడానికి నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర గ్రామ గ్రామాన ప్రజలను ఐక్యమత్యం చేయడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తున్నామని అన్నారు.ఈ ప్రాంతంలో గద్వాల కోటపైన బహుజన జండా ఎగరవేయడానికి బహుజనులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు కొరకు నడిగడ్డ ప్రాంతంలో గద్వాల నియోజకవర్గంలో వచ్చే మార్పు రాష్ట్ర నలుమూలల తెలిసేలా ఒక చరిత్రలో నిలవాలని కోరారు.ఈ నడిగడ్డ ప్రాంతంలో విద్య,వైద్యం సంక్షేమ అభివృద్ధికై మా పోరాటం నిర్వహిస్తామని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మాట్లాడారు. గద్వాల కోటపై బహుజన జండా ఎగరాలంటే మహనీయుడు అందరివాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. ఇచ్చిన ఓటు అనే బలమైన ఆయుధంతో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

ఈ సందర్భంగా అయా గ్రామాల్లో ప్రజలు వారి సమస్యలను గోంగళ్ళ రంజిత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్,నజుముల్లా, కార్యదర్శి తిమ్మప్ప, సోషల్ మీడియా ఇంచార్జి శేషంపల్లి ఆంజనేయులు, ఆశన్న, లక్ష్మన్న, చిన్న రాముడు, కె.పి. రామకృష్ణ, నాయకులు వీరేష్,నాగేష్, అవనిశ్రీ, రంగస్వామి, పరుషరాముడు, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షుడు మునెప్ప,ప్రధాన కార్యదర్శి రాము, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శాంతన్న, గట్టు మండల అధ్యక్షుడు బలరాం, ఉపాధ్యక్షుడు దయాకర్, కార్యదర్శి నరేష్, వెంకట్రాములు, జమ్మన్న, నరసింహులు, కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి, భీమన్ గౌడ్, హనుమంతు రెడ్డి, ఏసన్న, రాము, ఎల్లేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.