- ఓ వెంచర్ ఫామ్ హౌజ్ లో పోలీసుల దాడి..
- ఫామ్ హౌస్ లే అడ్డాగా పెరుగుతున్న అక్రమ కార్యక్రమాలు
- పోలీసుల అదుపులో 5 మంది విటులు?!
- ఓ ప్రజా ప్రతినిధి ఫామ్ హౌజ్ లో తతంగం..
ముద్ర, రంగారెడ్డి ప్రతినిధి: ఫామ్ హౌస్ లే అడ్డాగా అక్రమ కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఫామ్ హౌస్లే అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా 15 రోజులుగా వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ఫామ్ హౌజ్ లో పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన ఐదుగురు విటులు యువతీని ఫామ్ హౌస్ కు తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే యువతీనీ ప్రలోభ పెట్టి తీసుకు వచ్చారా? లేక వ్యభిచార నేపథ్యంలో తీసుకువచ్చారా? అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఒక యువతితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి మూడు కార్లు.. నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది మహేశ్వరం ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఓ సర్పంచ్ ఈ ఫామ్హౌస్ అని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ విషయమై కొత్తూరు సిఐ బాలరాజ్ ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ 5 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు. బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచారు.
ఆ ప్రజాప్రతినిధి ఉన్నాడా..?
ఈ సంఘటనలో ఓ ప్రజా ప్రతినిధి ఉన్నట్టు బయట ప్రచారం కొనసాగుతోంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా? అనే అంశం చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్ లో మొత్తం ఆరు మంది మహిళతో కలిపి ఉండగా ఇందులో ఐదు మంది పోలీస్ అదుపులోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరిలో సదరు ప్రజాప్రతినిధి ఉన్నాడా? లేదా అన్న విషయం విచారణలో తెలియాల్సి ఉంది. సదరు ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసి పోలీసులకు సమాచారం అందజేసినట్లు కూడా స్పష్టం అవుతుంది.