ఖమ్మం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లోని వసుంధర ఓకేషనల్ కళాశాల వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దు. చిత్త శుద్దితో పనిచేస్తే ఉన్నత స్థాయి కి ఎదుగుతారు. ప్రజాప్రతినిధిగా రెండు మూడు సంవత్సరల్లోనే అభివృద్ధి చేశా. రామదాసు జీవిత చరిత్ర కోసం నాలుగు కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టాం. నేలకొండపల్లి లో డిగ్రీ,ఇంటర్ కళాశాల కు భవనాలు ఏర్పాటు చేసాం. ప్రజల కోరిక మేరకు జాతీయ రహదారి ని ఊరు బయట నుంచి రూట్ మార్చాను. పాతకాలువ 70 కోట్ల తో పూర్తి చేశా. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువ శాతం నీటి పారుదల సౌకర్యం కలిగిన నియోజకవర్గం పాలేరు. పేదరికాన్ని పారద్రోలటానికి నియోజకవర్గం అభివృద్ధి చేశానని అన్నారు.
ఇంకో నాలుగు సంవత్సరాలు తరువాత పాలేరు నియోజకవర్గం లాంటి నియోజకవర్గం మరొకటి ఉండదు. సీతారామా కూడా పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరుకు తీసుకొస్తానని అన్నారు. ఆనాడు ఇచ్చిన మాట కోసం పెద్ద పాలేరు గా పనిచేశా. ఆదర్శవంత మైన నియోజకవర్గం గా పాలేరు ను తీర్చిదిద్దాను. మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నానని అన్నారు.