Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆధార్ ఇవ్వకపోతే.. రేషన్‌కార్డులో మీ పేర్లు ఉండవ్..

0

ఆధార్‌ నెంబరు సమర్పించని పిల్లల పేర్లను రేషన్‌కార్డు ల నుంచి అధికారులు తొలగించారు. రేషన్‌కార్డు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్‌ నెంబర్లు అప్‌లోడ్‌ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్‌ ఉంటే ఆ నెంబరు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి. ఐదేళ్లకు పైగా ఉన్న వారు ఆధార్‌ నెంబరు తప్పని సరిగా నమోదు చేయాలి. అయితే పలువురు వారి పిల్లల నెంబర్లు నమోదు చేయడం లేదు. వారి జాబితా రేషన్‌ దుకాణాలకు పంపి ఆధార్‌ నెంబరు నమోదు చేయాలని ఉద్యోగులకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలను ఉద్యోగులు కార్డుదారులకు తెలియజేయడం లేదు. అదే సమయంలో పలువురు పిల్లల పేర్లు కార్డు నుంచి అధికారులు తొలగించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie