A place where you need to follow for what happening in world cup

బడ్జెట్లో గల్ఫ్ కార్మికులను విస్మరించడం బాధాకరం

0
  • గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి
  • బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్
  • జగిత్యాల, ఫిబ్రవరి 08

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై పాలసీ హామీగానే ఎన్నారైల పట్ల కలగానే మిగిలిపోయిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక తెలంగాణ ప్రాంతవాసులు దుబాయ్ మస్కట్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి గొంతు చించుకొని మాట్లాడిన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ గల్ఫ్ అన్నలకు ఎలాంటి ప్యాకేజీని ఇప్పటి వరకు ప్రకటించకుండా తెడ్డు చూపారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు.

బుధవారం పెగడపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూపొందించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడమే కాకుండా పలు సందర్భల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారని ఎన్నారై పాలసీ కోసం రాష్ట్ర బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని గల్ఫ్ దేశాలు పోయి ఇబ్బందులు పడుతున్న వారికోసం కేరళ ప్రభుత్వం లాగా ప్రత్యేక ప్యాకేజి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గల్ఫ్ కుటుంబీకులు ఓట్లతో గద్దెనెక్కి ఒడ్డు దాటేదాక ఓడమల్లన్న ఒడ్డు దాటినాక బోడమల్లన్న రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అధికార పగ్గాలు చేపట్టి తొమ్మిదిఏళ్ళు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం దారుణం అన్నారు.ప్రత్యేక పాలసీ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని ఆశించిన  గల్ఫ్ బాధిత కుటుంబాలు ఎదురు చూపులతో కాలం వెళ్లదీస్తున్నారని గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎనిమిది లక్షల మంది తెలంగాణ ప్రాంత వాసులు ఉన్నారని వీరిలో అధికంగా జగిత్యాల, కరీంనగర్,వరంగల్,మెదక్,సంగారెడ్డి సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు అధికసంఖ్యలో ఉన్నారని వీరికి సరైన సమయంలో జీతాలు అందకపోవడం పలు కేసుల్లో ఇరుక్కుపోయి జైల్లల్లో మగ్గుతుండడం వివిధ కారణాల వల్ల  విదేశాల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు స్వస్థలాలకు రాకపోవడం ఏజెంట్ల మోసాలకు గురయ్యి ఇక్కట్ల పాలవడం వంటి సమస్యలను గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

కరోన కాలంలో గల్ఫ్ లో ఉంటున్నవారి  జీవితాలు మరింత దుర్భరంగా మారాయని  దీంతో ఎన్నారైలపైన ఆధారపడ్డ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఎన్నారైల ద్వారా ఏటా సుమారు పన్నెండు వందల కోట్ల ఆదాయం విదేశీ మారకద్రవ్యం రూపంలో వస్తున్నప్పటికీ గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎంపీటీసీ చింతకింది అనసూయ, మండల ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.