మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట ప్రాంతంలో గల అటవీప్రాంతంలో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండగా పేల్చిన అక్రమ బ్లాస్టింగ్ లో కేశన్న అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు గానీ పోలీసులు గానీ పట్టించు కోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.