Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అమరజీవి కామ్రేడ్ కె సుబ్బన్న సుబ్బన్న జీవితం అందరికీ ఆదర్శం

0

సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర:కడప
కార్మిక, కర్షక కష్టజీవులకు అండగా నిలిచి, జీవితాంతం కమ్యూనిస్టు గా జీవించిన పీడిత జన పోరాటయోధుడు, అమరజీవి, కామ్రేడ్ కె. సుబ్బన్న అని సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర కొనియాడారుమంగళవారం కామ్రేడ్ కె.సుబ్బన్న 16వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో సుబ్బన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు, జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితాంతం కార్మికుల, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు గా,పీడిత జన పోరాట యోధులుగా చరిత్రలో చిర స్థాయిగా నిలిచారన్నారు. ఆలంఖాన్ పల్లెలో పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా, ఎస్సీ కాలనీ నిర్మాణంలోనూ, దండు, యానాది కాలనీ స్థాపించడం లోనూ ,ఎర్రగుంట్ల సిమెంట్ ఫ్యాక్టరీ లల్లో, మంగంపేట బైరటీస్ గనుల్లో, ఆర్టీసీలో ఏఐటీయూసీ కార్మిక సంఘం నిర్మాణం చేయడంలో, గండికోట ప్రాజెక్టు సాధనకు ఆమరణ దీక్ష చేసిన వారిలో ఒకడిగా, రామన పల్లెలో దళితులకు అండగా కూలీ రేట్లు పెంచడంలో క్రియాశీలక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. యువత పెడమార్గం పడకుండా సంక్రాంతి ఉత్సవాలు, బాల సంఘం ఏర్పాటు తదితర సామాజిక రాజకీయ చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు. సుబ్బన్నగారి ఉద్యమ స్ఫూర్తితో ఈతరం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఫాసిస్టు బిజెపి కేంద్ర ప్రభుత్వo, వారికి వంత పాడుతున్న వైసీపీ జగన్ ప్రభుత్వo అరాచక పాలన కు వ్యతిరేకంగా ప్రజా శ్రేణులను ఉద్యమాలకు సమాయత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

సిపిఐ సీనియర్ నాయకులు పి. కృష్ణమూర్తి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు రాజకీయాలలో కె సుబ్బన్న గారి కుటుంబం ఆదర్శ ప్రాయమన్నారు. కే సుబ్బన్న ఒక లీడర్ గా అనేకమందికి స్ఫూర్తి ప్రదాత అన్నారు. నేటి యువతరం నాటి త్యాగధనుల ఆశయాలను పుణికి పుచ్చుకుని ఆదర్శవంతమైన ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటి సుబ్బన్న గారి సతీమణి కామ్రేడ్ శాంతమ్మ, సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ, సహాయ కార్యదర్శులు కేసీ బాదుల్ల, యు మద్దిలేటి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యం వి సుబ్బారెడ్డి, ఏఐవైఎఫ్ ద్రవిడ సురేష్, ఆలంఖాన్ పల్లి సిపిఐ నాయకులు చెంచయ్య, నాగరాజు, సోమారపు సుబ్బరాయుడు, నరసింహులు, భరత్ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, ఒబయ్య, మునయ్య, భాగ్యలక్ష్మి, వలరాజు, నాగిరెడ్డి, మైనుద్దీన్, పకీరప్ప,నాగరాజు, రైతు సంఘం నాయకులు జయన్న, శంకర్ రెడ్డి, బాలచంద్ర నాయుడు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie